పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ సాయంతో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటవగా (ప్రభ్‌సిమ్రన్ 0), శశాంక్ సింగ్, ఆర్యతో కలిసి ఆరో వికెట్‌కు 71 రన్స్ జోడించాడు. ఆర్య ఔటైన తర్వాత శశాంక్ , మార్కో యన్సెన్‌తో కలిసి దూకుడు కంటిన్యూ చేశాడు. శశాంక్ 36 బాల్స్‌లో 52 నాటౌట్, యన్సెన్ 19 బాల్స్‌లో 34 నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో ఖలీల్, అశ్విన్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి.
217 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో చెన్నై విఫలమైంది. ఓపెనర్లలో రచిన్ 39 రన్స్ చేయగా, కాన్వే 69 రన్స్ చేసి రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోయాడు. ఆ తర్వాత దూబె 42, ధోని 27 రన్స్ చేసినప్పటికీ..చివర్లో సాధించాల్సిన రన్‌రేట్ పెరగడంతో ఓటమి తప్పలేదు. పంజాబ్ పేసర్ ఫెర్గుసన్‌కు 2 వికెట్లు దక్కాయి.
కింగ్స్ ఫైట్ పంజాబ్‌దే

Categories: