Cricket Josh IPL పంజాబ్ కా స్వీట్ 16..

పంజాబ్ కా స్వీట్ 16..

పంజాబ్ కా స్వీట్ 16.. post thumbnail image

ప్రియాన్ష్ ఆర్య‌..ద సెంచ‌రీ హీరో. పంజాబ్ కింగ్స్‌కు భారీ స్కోర్ అందించ‌డ‌మే కాదు, రికార్డు పుస్త‌కాల్లో త‌న పేరు లిఖించుకున్నాడు. ఈ సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌పున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స్‌లు సాధించిన ఆట‌గాడిగా..శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డును స‌మం చేశాడు. శ్రేయ‌స్ గుజ‌రాత్‌పై 9 సిక్స్‌లు కొట్ట‌గా..ఆర్య సీఎస్కేపై 9 సిక్స్‌లు కొట్టి సెంచ‌రీ చేశాడు. 39 బంతుల్లోనే సెంచ‌రీ చేయ‌డం ద్వారా ఐపీఎల్‌లో వేగంగా సెంచ‌రీ చేసిన జాబితాలో 4వ స్థానానికి చేరి స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు ట్రావిస్ హెడ్ రికార్డును స‌మం చేశాడు. హెడ్ కూడా గ‌తేడాది ఆర్సీబీపై 39 బాల్స్‌లో సెంచ‌రీ చేశాడు. ఇక పంజాబ్ త‌ర‌పున సెంచ‌రీ చేసిన 16వ ఆట‌గాడిగా ప్రియాన్ష్ ఆర్య రికార్డుల‌కెక్కాడు.

పంజాబ్ త‌ర‌పున సెంచ‌రీ హీరోలు
షాన్ మార్ష్ 2008
ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ 2008
మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే 2010
పాల్ వాల్తాటీ 2011
ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ 2011
డేవిడ్ మిల్ల‌ర్ 2013
వీరేంద‌ర్ సెహ్వాగ్ 2014
వృద్ధిమాన్ సాహా 2014
హ‌షీమ్ ఆమ్లా (2) 2017
క్రిస్ గేల్ 2018
కే ఎల్ రాహుల్ 2019
కే ఎల్ రాహుల్ 2020
మ‌యాంక్ అగ‌ర్వాల్ 2020
ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ 2023
జానీ బెయిర్ స్టో 2024
ప్రియాన్ష్ ఆర్య 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ధోని..ద ఫినిష‌ర్..అంతేధోని..ద ఫినిష‌ర్..అంతే

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థ‌లా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన త‌రుణం రానే వ‌చ్చింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ద ఫినిష‌ర్ అనే ట్యాగ్ లైన్‌ను మ‌ళ్లీ గుర్తు

బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్

గుజ‌రాత్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..సెంచ‌రీ మిస్ చేసుకున్నా స‌రే, త‌న టీమ్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించాడు. అది కూడా 204 ప‌రుగుల టార్గెట్‌..అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి

మాజీ ప్రియుడి ట్రెండ్మాజీ ప్రియుడి ట్రెండ్

మాజీ ప్రియుడే హ‌త‌మార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ త‌ర‌చుగా క్రైమ్‌ వార్త‌ల్లో చూస్తాం. ఇక్క‌డ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవ‌చ్చు. ఈ సీజ‌న్‌లో అదే ట్రెండ్