ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో అడుగుపెట్టిన ఆర్య, 2023లో లిస్ట్ ఏలో డెబ్యూ చేశాడు. రీసెంట్‌గా జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక ఐపీఎల్ వేలంలో ఇతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆ పోటీలో పంజాబ్ ఇతడిని దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఆర్యను పంజాబ్ రూ.3.8 కోట్లకు దక్కించుకుంది.
ప్రతీ పైసాకు లెక్క చెబుతూ..సీఎస్కేపై అతడి ఇన్నింగ్స్ సాగింది. న్యూ ఛండీగర్‌లో జరిగిన మ్యాచ్‌లో
చెన్నై సూపర్ కింగ్స్‌పై 39 బాల్స్‌లోనే సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఓపెనర్‌గా వచ్చి సీఎస్కే బౌలర్లను ఆటడుకున్నాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా సరే..తన దూకుడు పెంచాడే తప్ప, తగ్గించలేదు. ఆరో వికెట్‌కు శశాంక్‌తో కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ చేసిన తర్వాత 103 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రియాన్ష్ ఔటయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్‌లో విజయ్ శంకర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ప్రియాన్ష్ డగౌట్‌కు వెళుతున్నపుడు మిగతా ప్లేయర్లతో పాటు స్టేడియం అంతా చప్పట్లతో అతడిని అభినందించింది.
6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య..ఇప్పుడు సెంచరీ

Categories: