Cricket Josh IPL పే…..ద్ద ఓవ‌ర్

పే…..ద్ద ఓవ‌ర్

పే…..ద్ద ఓవ‌ర్ post thumbnail image

శార్దూల్ ఠాకూల్…ఉర‌ఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 5 వైడ్‌లు వేశాడు. ఆ త‌ర్వాతే లీగల్‌గా ఓవ‌ర్ మొద‌లైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవ‌ర్ ముగించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇలా పే…ద్ద ఓవ‌ర్లు వేయ‌డం ఇది మూడోసారి. గ‌తంలో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ముంబైపై 2023లో 11 బాల్స్ ఓవ‌ర్ వేశాడు. అదే సీజ‌న్‌లో తుషార్ దేశ్‌పాండే ల‌క్నోపై 11 బాల్స్ ఓవ‌ర్ వేశాడు.

గ‌తేడాది ఛాంపియ‌న్స్ ట్రోఫిలో మ‌హ్మ‌ద్ ష‌మి పాకిస్తాన్‌పై 11 బాల్స్ వేశాడు. అందులో 5 వైడ్‌లు ఉన్నాయి.
జ‌హీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా గ‌తంలో వ‌న్డేల్లో 11 బాల్స్ ఓవ‌ర్ వేశారు. జ‌స్ప్రిత్ బుమ్రా కూడా ఛాంపియ‌న్స్ ట్రోఫి 2017 ఫైన‌ల్లో పాకిస్తాన్‌పై 9 బాల్స్ ఓవ‌ర్ వేశాడు.

ఇక ఓవ‌రాల్‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో ఈ చెత్త రికార్డులో పాకిస్తాన్ బౌల‌ర్ ముందున్నాడు. పాక్ పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ స‌మి 2004 ఆసియాక‌ప్‌లో బంగ్లాదేశ్‌పై వ‌న్డే మ్యాచ్‌లో 17 బాల్స్ ఓవ‌ర్ వేశాడు. అందులో 7 వైడ్లు, 4 నో బాల్స్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోనిరుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోని

వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కార‌ణంగా మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలున్నాయి.

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..

మొత్తానికి కొన్ని గంట‌లుగా బెంగ‌ళూరులో కురుస్తున్న వ‌ర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్న‌ర‌కు టాస్ వేయ‌గా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో వ‌రుస‌గా మూడోసారి మొద‌ట బ్యాటింగ్ చేయ‌బోతోంది. రెండు సార్లు మొద‌ట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది.