Cricket Josh IPL క‌ప్పు ముఖ్యం బిగిలు..

క‌ప్పు ముఖ్యం బిగిలు..

క‌ప్పు ముఖ్యం బిగిలు.. post thumbnail image

ఈ న‌లుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్‌..త‌మ త‌మ టీమ్స్‌ను ఐపీఎల్‌లో బ్ర‌హ్మాండంగా న‌డిపిస్తున్న తీరు చూస్తే..వీళ్ల‌లో ఒక‌రు క‌ప్పు కొట్ట‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్, గుజ‌రాత్ జెయింట్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్, కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్..ఈ న‌లుగురు త‌మ టీమ్స్‌ను పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిపేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్ప‌టికే ఈ నాలుగు టీమ్స్ మ‌ధ్య ఆ వార్ న‌డుస్తోంది. మ‌రి వీళ్ల‌లో ఒక‌రు క‌ప్పు గెలిస్తే..దెబ్బ అదుర్స్ క‌దూ అనాల్సిందే..

పంజాబ్ కింగ్స్
గ‌త సీజ‌న్ కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌కు నాయ‌కత్వం వ‌హించి క‌ప్పు గెలిపించిన శ్రేయ‌స్ అయ్య‌ర్..ఈసారి పంజాబ్‌కు కెప్టెన్సీ చేస్తూ అద‌ర‌గొడుతున్నాడు. పంజాబ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా టైటిల్ గెల‌వ‌లేదు. 2008 తొలి సీజ‌న్‌లో మూడో స్థానంలో నిల‌వ‌గా, 2014లో తొలిసారిగా ఫైన‌ల్ చేరి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిందే లేదు. పాయింట్స్ టేబుల్‌లో 5 నుంచి 8 స్థానాల మ‌ధ్య కొట్టుమిట్టాడింది. గ‌త సీజ‌న్‌లో 9వ స్థానానికి ప‌రిమిత‌మైంది. కానీ ఈ సీజ‌న్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో బుల్లెట్‌లా దూసుకుపోతోంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్
18 సీజ‌న్లుగా ఆడుతున్నా..కప్పు అందుకోలేక‌పోయిన మ‌రో టీమ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఈ టీమ్ కూడా ఒకే ఒక్క‌సారి 2020లో ఫైన‌ల్‌కు చేరింది. అప్పుడు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్. ఓవ‌రాల్‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 సీజ‌న్ల‌లో ప్లే ఆఫ్స్‌కు చేరినా..ముందుకెళ్ల‌లేక‌పోయింది. ఈసారి ఆ బాధ్య‌త అక్ష‌ర్ ప‌టేల్‌పై ఉంది. టీమ్ కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా క‌నిపిస్తోంది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాద‌వ్‌, మోహిత్ శ‌ర్మ వంటి టీమిండియా ప్లేయ‌ర్లు…ఫాఫ్ డుప్లెసీ, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌, మిచెల్ స్టార్క్‌, మెక్‌గ‌ర్క్ వంటి ఫారిన్ స్టార్ల‌తో అద్బుతంగా ఉంది. అంద‌రూ ఫామ్‌లో ఉండ‌టం ఈ టీమ్‌కు క‌లిసొచ్చే అంశం.

గుజ‌రాత్ టైట‌న్స్
గుజ‌రాత్ టైట‌న్స్ అడుగుపెట్టిన తొలి సీజ‌న్ (2022)లోనే హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో టైటిల్ గెలిచి శెభాష్ అనిపించుకుంది. ఆ త‌ర్వాతి సీజ‌న్‌ 2023లోనూ ఫైన‌ల్‌కు చేరి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. 2024లో శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్సీ చేప‌ట్టిన త‌ర్వాత గుజ‌రాత్ 8వ స్థానానికి ప‌రిమిత‌మైంది. ఐతే ఈసీజ‌న్‌లో మాత్రం టీమ్ గెలుపు బాట‌లో ప‌య‌నిస్తోంది. కెప్టెన్‌తో పాటు సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్‌, సాయి కిశోర్, ఫామ్‌లో ఉన్నారు. ఫారిన్ ప్లేయ‌ర్లు జాస్ బ‌ట్ల‌ర్‌, క‌గిసో ర‌బాగ‌, ర‌షీద్ ఖాన్ త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు ఆడితే గుజ‌రాత్‌కు తిరుగుండ‌దు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
రిష‌బ్ పంత్ కెప్టెన్‌గా భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ల‌క్నో టోర్నీలో అద‌ర‌గొడుతోంది. ఈ టీమ్ కూడా అడుగుపెట్టిన తొలి సీజ‌న్ 2022లో కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలో ప్లే ఆఫ్స్‌కు చేరి మూడో స్థానంలో నిలిచింది. ఇక 2023లోనూ 3వ స్థానంలో నిలిచింది. గ‌త సీజ‌న్ 2024లో మాత్రం 7వ స్థానానికి ప‌రిమిత‌మైంది. ఈ సీజ‌న్‌లోనూ వ‌రుస విజ‌యాల‌తో అద‌ర‌గొడుతోంది. మిచెల్ మార్ష్‌, నికోల‌స్ పూర‌న్, ఏడెన్ మార్క్‌ర‌మ్, శార్దూల్ ఠాకూర్, యువ స్పిన్న‌ర్ దిగ్వేశ్ రాఠీ ఫామ్‌లో ఉండటం ల‌క్నోకు క‌లిసొచ్చే అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఇది కూడా పాయే..ఇది కూడా పాయే..

పిచ్ మారింది..ఫ‌లితం మార‌లేదు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో మ‌రో ఓట‌మి..మ‌నోళ్లు బ్యాటింగ్ చేస్తున్న‌పుడు స్లో వికెట్ క‌దా..150 ప్ల‌స్ స్కోర్ స‌రిపోవ‌చ్చులే అనుకున్నారు. ప‌వ‌ర్ ప్లేలో 4 ఓవ‌ర్ల‌కు 16 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన‌పుడు..ఇక మ్యాచ్ మ‌న‌దే అనుకున్నాం..కానీ

ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఐతే ఆక్ష‌న్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆట‌గాళ్ల‌లో ముఖ్యంగా చెప్పుకోవ‌ల్సింది కేఎస్ భ‌ర‌త్ గురించి. 2015లోనే

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ స‌న్‌రైజ‌ర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ స‌న్‌రైజ‌ర్స్‌కి

క‌ర్ణ్‌శ‌ర్మ‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై అద్భుత‌మైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి అస‌లైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 ప‌రుగుల టార్గెట్‌ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,