పిచ్ మారింది..ఫలితం మారలేదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో ఓటమి..మనోళ్లు బ్యాటింగ్ చేస్తున్నపుడు స్లో వికెట్ కదా..150 ప్లస్ స్కోర్ సరిపోవచ్చులే అనుకున్నారు. పవర్ ప్లేలో 4 ఓవర్లకు 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినపుడు..ఇక మ్యాచ్ మనదే అనుకున్నాం..కానీ అప్పుడొచ్చాడు, ఒకప్పుడు మనోడే, ఇప్పుడు పగోడయ్యాడు..వాషింగ్టన్ సుందర్ వస్తూనే విధ్వంసం సృష్టించాడు. సిమర్‌జిత్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో వాషింగ్టన్ ఏకంగా 20 రన్స్ స్కోర్ చేశాడు..ఇంకేముంది సీన్ మారిపోయింది..మ్యాచ్ గుజరాత్ చేతిలోకి వెళ్లిపోయింది. సుందర్ 49 రన్స్ చేసి ఔటవగా, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 61 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి టీమ్‌ను గెలిపించాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ దూకుడుగా ఆడి 16 బాల్స్‌లో 35 నాటౌట్‌తో మ్యాచ్‌ను తొందరగా ఫినిష్ చేశాడు. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. ఓపెనర్లు అభిషేక్, ట్రావిస్ హెడ్ మరోసారి నిరాశపరచగా..నితీశ్ 31 రన్స్ చేశాడు. ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.