గ్లెన్ ఫిలిప్స్..ధనాధనా సిక్సర్లు కొట్టమంటే, సిక్సర్లు కొడతాడు. స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయమంటే వికెట్లు తీస్తాడు, కనీసం బ్యాటర్లను కట్టడైనా చేస్తాడు..క్యాచ్‌లు పట్టుకోవాలంటే నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లు పట్టుకుంటాడు. ఫిల్డింగ్ చేసి రన్స్ ఆపాలంటే డైవ్ చేసి మరి రన్స్ ఆపుతాడు. ఇన్ని డైమెన్షన్స్ ఉన్న ప్లేయర్‌ను ఏ టీమ్ ఐనా వదులుకుంటుందా..? అబ్బే ఐపీఎల్‌లో అట్లాంటి సిద్ధాంతాలేమీ ఉండవు..టాలెంట్ ఉన్నాసరే బెంచ్‌కే పరిమితం చేస్తారు..వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అందించడానికి ఉపయోగిస్తారు..ఇంత టాలెంటెడ్ ప్లేయర్ ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉండేవాడు..ఇప్పుడు గుజరాత్ టైటన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మారింది టీమ్ మాత్రమే, పొజిషన్ కాదు. బెంచ్‌కే పరిమితం. తాజాగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇతడిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఉపయోగించుకుంది. కానీ దురదృష్టవశాత్తు..ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకోబోయి ఇంజ్యూర్ అయ్యాడు. బంతి సెన్సిటివ్ ఏరియాలో తగలడంతో అతడు ఫిజియో సహకారంతో గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. ఫిలిప్స్‌కు అవకాశాలు రాక కలత చెందుతుంటే, మళ్లీ ఇలా గాయాలు కూడానా…పాపం ఫిలిప్స్ అంటూ నెటిజన్లు అతడికి సానుభూతితో కూడిన మద్దతు తెలుపుతున్నారు.
అయ్యో..ఫిలిప్స్

Categories:
Related Post

వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?
సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్‌కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్‌లకు మిస్సైతే సన్‌రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు

కింగ్స్ ఫైట్ పంజాబ్‌దేకింగ్స్ ఫైట్ పంజాబ్‌దే
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ సాయంతో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా

ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్…రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్‌లో కీలక స్పిన్నర్. ఐతే ఇతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుజరాత్ మూడు మ్యాచులు ఆడగా..రషీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది