సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్…రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్‌లో కీలక స్పిన్నర్. ఐతే ఇతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుజరాత్ మూడు మ్యాచులు ఆడగా..రషీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది కూడా అహ్మదాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై. ఆ తర్వాత ముంబైపై వికెట్లేమీ తీయలేదు. ఇక ఆర్సీబీపై కూడా వికెట్ తీయలేదు, పైగా 4 ఓవర్లలో 54 రన్స్ ఇచ్చి ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. మరి రషీద్ తిరిగి ఫామ్‌లోకి రావడానికి హైదరాబాద్ వేదిక కానుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే రషీద్ ఈ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అతడికి ఎంతో అనుభవం ఉంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఆటగాళ్లు పెద్దగా ఫామ్‌లో లేరు..రషీద్ ఖాన్ టచ్‌లోకి వస్తే ఒక్క క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. పేలవంగా బౌలింగ్ వేస్తున్న రషీద్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తారా? లేదా దాసోహమంటూ అతడిని తిరిగి ఫామ్ అందిపుచ్చుకునేలా చేస్తారో చూడాలి.
ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?

Categories:
Related Post

ఈ సీజన్‌లో హ్యాట్రిక్ మొనగాళ్లు..ఈ సీజన్‌లో హ్యాట్రిక్ మొనగాళ్లు..
ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వరుసగా విజయాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. గత

SRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెలవాలిSRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెలవాలి
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయి తమ ప్రయాణాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 4 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్‌కు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే