Cricket Josh IPL స్ట్రాటెజీ మారుస్తారా..? త‌గ్గేదేలే అంటారా?

స్ట్రాటెజీ మారుస్తారా..? త‌గ్గేదేలే అంటారా?

స్ట్రాటెజీ మారుస్తారా..? త‌గ్గేదేలే అంటారా? post thumbnail image

వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ఓట‌మిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందిక‌రంగా మార్చుకుంటున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజ‌రాత్ టైట‌న్స్‌తో సొంత‌గడ్డ‌పై జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో విజ‌యం సాధించి మ‌ళ్లీ గాడిలో ప‌డాల్సిందే. ట్రావిస్ హెడ్ మిన‌హా మిగ‌తా టాపార్డ‌ర్ విఫ‌ల‌మ‌వుతోంది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న రేంజ్ చూపించాల్సిందే. తొలి మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన ఇషాన్ కిష‌న్..కుదురుకొని ఆడాల్సిందే. నితీశ్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. క్లాసెన్ కూడా గేర్ మార్చాల్సిన టైమ్. బ్యాటింగ్‌లో కొన్ని లోపాల‌ను స‌రిచేసుకున్నా..బౌలింగ్‌లోనూ రిపేర్ వ‌ర్క్స్ చాలా ఉన్నాయి. పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న స్థాయికి త‌గ్గ‌ట్టు బౌలింగ్ చేయాలి. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌..మ‌రింత ఎఫెక్టివ్‌గా మారాలి. స్పిన్ విభాగంలో రాహుల్ చ‌హార్‌కి చాన్స్ ఇవ్వొచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడ‌మ్ జాంప‌ను తీసుకోవాల్సిందే. బౌలింగ్‌ను స్ట్రాంగ్‌గా చేసుకోవాలంటే వికెట్‌టేకర్స్‌కు అవ‌కాశ‌మివ్వ‌క త‌ప్ప‌దు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెలుపు బాట ప‌ట్టాలంటే క‌చ్చితంగా తుది జ‌ట్టులో మ్యాచ్ విన్న‌ర్ల‌ను, సీనియ‌ర్ బౌల‌ర్ల‌ను చేర్చుకోవాలి. మ‌రి కెప్టెన్ క‌మిన్స్ స్ట్రాటెజీ మారుస్తాడా? లేక దంచుడు ఫార్ములాకే క‌ట్టుబ‌డి ఉంటాడా? వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రైజర్స్ ఫాలింగ్‌..రైజర్స్ ఫాలింగ్‌..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో 5వ ఓట‌మి. ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ఓట‌మి చ‌విచూసింది. పిచ్ స్లోగా ఉండ‌టం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త క‌లిసొచ్చిన‌ప్ప‌టికీ…స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. ముంబై బౌల‌ర్లు ప‌క్కా ప్లానింగ్‌తో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌ను

ఇది కూడా పాయే..ఇది కూడా పాయే..

పిచ్ మారింది..ఫ‌లితం మార‌లేదు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో మ‌రో ఓట‌మి..మ‌నోళ్లు బ్యాటింగ్ చేస్తున్న‌పుడు స్లో వికెట్ క‌దా..150 ప్ల‌స్ స్కోర్ స‌రిపోవ‌చ్చులే అనుకున్నారు. ప‌వ‌ర్ ప్లేలో 4 ఓవ‌ర్ల‌కు 16 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన‌పుడు..ఇక మ్యాచ్ మ‌న‌దే అనుకున్నాం..కానీ

ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఐతే ఆక్ష‌న్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆట‌గాళ్ల‌లో ముఖ్యంగా చెప్పుకోవ‌ల్సింది కేఎస్ భ‌ర‌త్ గురించి. 2015లోనే