ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వరుసగా విజయాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ, చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నోపై గెలిచి..ఆత్మవిశ్వాసంతో సీజన్‌ను ముగించింది. ఐతే ఎక్కడైతే ఆపిందో మళ్లీ అక్కడి నుంచే మొదలెట్టింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో లక్నోతో తలపడి భారీ టార్గెట్(210)ను ఛేదించి ఘనంగా ఆరంభించింది. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అలవోకగా గెలిచింది. మూడో మ్యాచ్‌లో చెన్నైని చెపాక్‌లో ఓడించి వావ్ అనిపించింది. ఇదే దూకుడుగా కొనసాగిస్తే..టైటిల్ రేసులో ఉండటం గ్యారెంటీ.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ స్లో వికెట్‌పై 183 పరుగుల డీసెంట్ స్కోర్ నమోదు చేసింది. ఫాఫ్ డుప్లెస్సీ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లో వచ్చాడు. చివరి వరకూ ఆడి 77 రన్స్ తో ఇరగదీశాడు. మిడిల్ ఓవర్స్‌లో అభిషేక్ పొరెల్, కెప్టెన్ అక్షర్ పటేల్ దూకుడుగా ఆడగా..చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 12 బాల్స్‌లో 24 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.