Cricket Josh IPL రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే post thumbnail image

గ‌త సీజ‌న్‌లో మూడుసార్లు కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఈ సీజ‌న్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..త‌మ రేంజ్ స‌రిపోలేదంటూ మ‌రోసారి ఓడిపోయింది. బౌల‌ర్లు మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ ప్రత్య‌ర్థి కేకేఆర్‌కు 200 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నారు. మిడిల్ ఓవ‌ర్స్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ ఇర‌గ‌దీశాడు. 29 బాల్స్‌లో 60, ర‌ఘు వ‌న్సి 30 బాల్స్‌లో 50, రింకూ 17 బాల్స్‌లో 32 నాటౌట్‌తో దుమ్మురేపారు.

201 రన్స్ టార్గెట్‌ను ఛేదించ‌డంలో స‌న్‌రైజ‌ర్స్ ఏ ద‌శ‌లోనూ కుదురుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. ప‌వ‌ర్ ప్లేలో 9 ర‌న్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత కూడా బ్యాట‌ర్లు పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. క‌మిందు మెండిస్ కాసేపు ఫ‌ర‌వాలేద‌నిపించినా ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయాడు.75 ర‌న్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఓట‌మిని అప్పుడే ఖాయం చేసుకుంది. కావాల్సిన‌ ర‌న్‌రేట్ కొండంత ఉండ‌టంతో క్లాసెన్ కూడా ఔట‌వ‌డంతో స‌న్‌రైజ‌ర్స్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

చెపాక్‌లో విజిల్ మోత‌చెపాక్‌లో విజిల్ మోత‌

చెన్నై సూప‌ర్ కింగ్స్ సొంత‌గ్రౌండ్ చెపాక్‌లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్‌మ్యాన్ రోహిత్‌ను తొలి ఓవ‌ర్‌లోనే కోల్పోయింది. రోహిత్ డ‌కౌట్ అయిన త‌ర్వాత ముంబై బ్యాటర్లు వ‌రుస విరామాల్లో

RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?

RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో కీ రోల్ ప్లే చేయ‌బోతున్నాయి. ఈ కార్డ్ గ‌తంలో కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈసారి నిబంధ‌న మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే త‌మ ఆట‌గాడిని ఆక్ష‌న్‌లో తిరిగి ద‌క్కించుకోవాల‌నుకుంటుందో..ఆ ఆట‌గాడిని

లెట‌ర్ ఉందా? చెక్ చేసిన‌ సూర్యలెట‌ర్ ఉందా? చెక్ చేసిన‌ సూర్య

ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఒక స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మ‌డ‌మ కాస్త ట్విస్ట్ అవ‌డంతో..ఓవ‌ర్ మ‌ధ్య‌లో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, బ్యాట‌ర్ అభిషేక్‌శ‌ర్మ ద‌గ్గ‌రికి వెళ్లి అత‌డి