వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ నిరాశపరచగా…మిడిల్ ఆర్డర్‌లో లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ ఆదుకున్నారు. లివింగ్‌స్టన్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్ దూకుడుగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గుజరాత్ టైటన్స్ 170 టార్గెట్‌ను ఆడుతు పాడుతూ చేజ్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 49 రన్స్ చేసి ఔటవగా..జాస్ బట్లర్ దుమ్మురేపాడు. 39 బాల్స్‌లో 73 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో రూథర్‌ఫోర్డ్ కూడా దూకుడుగా ఆడి 18 బాల్స్‌లో 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి ధాటికి గుజరాత్ మరో 13 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్

Categories:
Related Post

బట్లర్.. వాహ్ చేజ్బట్లర్.. వాహ్ చేజ్
గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్..సెంచరీ మిస్ చేసుకున్నా సరే, తన టీమ్‌ను దగ్గరుండి మరీ గెలిపించాడు. అది కూడా 204 పరుగుల టార్గెట్..అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి

ఆ ఐదుగురితో జాగ్రత్తఆ ఐదుగురితో జాగ్రత్త
కోల్‌త నైట్‌రైడర్స్‌లోని కీలక ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల పట్టికలో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ పదో స్థానంలో ఉన్నాయి. గత సీజన్ ఫైనలిస్ట్‌లు ముందడుగు వేయాలంటే

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..
నవంబర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అంతా సిద్ధమైంది. ఆటగాళ్లు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఆక్షన్ లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోగా, ఇందులో