సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్‌కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్‌లకు మిస్సైతే సన్‌రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లోనే హెడ్ ఒక్కడే నిలకడగా ఆడాడు. ఒక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (67), ఆ తర్వాత వరుసగా 47, 22 రన్స్ స్కోర్ చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యే వరకు నిలబడ్డాడు. ఇప్పటికే పేకమేడలా కుప్పకూలుతున్న సన్‌రైజర్స్‌కు హెడ్ లేకపోవడం పూడ్చలేని లోటుగా మారనుంది. ఒకవేళ హెడ్ వెళ్లిపోతే అతడి స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఐతే ట్రావిస్ హెడ్ ఎప్పుడు వెళతాడు, మళ్లీ ఎప్పుడు తిరిగొస్తాడనే విషయంపై సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?

Categories:
Related Post

ఇదేందయ్యా ఇది..163 ఏందయ్యాఇదేందయ్యా ఇది..163 ఏందయ్యా
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా తక్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, పవర్ ప్లేలో 64 రన్స్

మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?
థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్‌గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి

ఈ సీజన్‌లో హ్యాట్రిక్ మొనగాళ్లు..ఈ సీజన్‌లో హ్యాట్రిక్ మొనగాళ్లు..
ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వరుసగా విజయాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. గత