Cricket Josh IPL కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?

కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?

కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.? post thumbnail image

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో కొత్త కుర్రాళ్ల హ‌వా కొన‌సాగుతోంది. అరంగేట్రంలోనే అద‌ర‌గొడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. వీళ్ల‌లో ముఖ్యంగా దిగ్వేశ్ రాఠీ , విఘ్నేష్ పుతుర్‌, జీష‌న్ అన్సారి, అశ్వ‌నీ కుమార్ ఉన్నారు. దిగ్వేశ్ రాఠీ, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై డెబ్యూ చేసిన ఈ యంగ్ లెగ్‌స్పిన్న‌ర్ ఆ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఈ లెగీ బౌలింగ్ యాక్ష‌న్ సునీల్ న‌రైన్, ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌ను పోలి ఉండ‌టం విశేషం.
ఇక విఘ్నేశ్ పుతుర్‌, కేర‌ళ‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్న‌ర్..ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున డెబ్యూలోనే ద‌మ్ము చూపించాడు. చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టి ముంబై అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. మేనేజ్మెంట్ ఫుల్ ఖుషీ అయింది. అంత‌కు ముందు టీ20 మ్యాచులు కూడా ఆడ‌కుండానే, డైరెక్ట్‌గా ఐపీఎల్‌లో ఈ రేంజ్ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంతో విశ్లేష‌కులు సైతం ఫిదా అయ్యారు.
జీష‌న్ అన్సారీ..స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున అరంగేట్రం చేసిన ఈ యూపీ లెగ్ స్పిన్న‌ర్‌..ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 3 వికెట్లు తీసి అదుర్స్ అనిపించాడు. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన అనుభ‌వం, యూపీ టీ20 లీగ్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిల‌వ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత‌డిపై న‌మ్మ‌కం పెట్టుకుంది. అరంగేట్రంలోనే న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుని శెభాష్ అనిపించుకున్నాడు.
ముంబై ఇండియ‌న్స్ వెలికితీసిన మ‌రో యువ‌ ఆణిముత్యం అశ్వ‌నీ కుమ‌ర్..23 ఏళ్ల ఈ పంజాబ్ లెఫ్టార్మ్ మీడియం పేస‌ర్ కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌పై అరంగేట్రంలోనే 4 వికెట్లు ప‌డ‌గొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ డెబ్యూలోనే ఫోర్ వికెట్ హాల్ తీసిన తొలి ఇండియా బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు. డెబ్యూలో తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య ర‌హానే ఔట్ చేసిన అశ్వ‌నీ కుమార్‌..ఆ త‌ర్వాత మ‌నీశ్ పాండే, రింకూ సింగ్, ఆండ్రే ర‌సెల్ వికెట్లు ద‌క్కించుకుని స‌త్తాచాటాడు. అశ్వ‌నీ కుమార్ ఐపీఎల్‌కు ముందు డొమెస్టిక్‌లో కేవ‌లం 4 టీ20 మ్యాచ్‌లే ఆడ‌టం విశేషం.
మ‌రి ఈ కుర్రాళ్లు ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేసి..వీళ్ల పేర్లు గుర్తుపెట్టుకునేలా చేస్తారా? టీమిండియాలోకి అడుగుపెట్టే దిశ‌గా దూసుకుపోతారో? వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఐతే ఆక్ష‌న్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆట‌గాళ్ల‌లో ముఖ్యంగా చెప్పుకోవ‌ల్సింది కేఎస్ భ‌ర‌త్ గురించి. 2015లోనే

RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?

RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో కీ రోల్ ప్లే చేయ‌బోతున్నాయి. ఈ కార్డ్ గ‌తంలో కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈసారి నిబంధ‌న మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే త‌మ ఆట‌గాడిని ఆక్ష‌న్‌లో తిరిగి ద‌క్కించుకోవాల‌నుకుంటుందో..ఆ ఆట‌గాడిని

అన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగోఅన్ని టీమ్స్ రిటైన్ లిస్ట్ కావాలా…ఇదిగో

ఇన్నాళ్లు ఉత్కంఠ రేపిన ఐపీఎల్ రిటెన్ష‌న్ పూర్త‌యింది. ఫ్రాంచైజీల‌న్నీ త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. అత్య‌ధికంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ 6 గురు ప్లేయ‌ర్స్‌ను రిటైన్ చేసుకోగా…పంజాబ్ కింగ్స్ కేవ‌లం ఇద్ద‌రినే రిటైన్ చేసుకుంది. ఇక రాజ‌స్థాన్