చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు..ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనిపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే తలాను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇంకెంతకాలం తలా తలా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయన బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి రావడం లేదు, మ్యాచ్‌లు గెలిపించడం లేదు..ఏదో 17, 18వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగి..ఒక పది బాల్స్ ఆడి ఒక ఫోరో, సిక్సరో కొట్టి వెళ్లిపోతాడు..అదే మహాప్రసాదం అనుకుంటూ బతికేస్తున్నాం..తలా అభిమానులం…అంటూ కొందరు ఫ్యాన్స్ చెన్నై ఓటమి అనంతరం మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఐతే ఇంకొందరు హార్డ్‌కోర్ అభిమానులు మాత్రం ధోని ఎలా ఆడిన తమకు ఫరవాలేదని, ఎప్పుడు ఏం చేయాలో, ఎలా ఆడాలో ఆయనకు బాగా తెలుసని, ఒకటి రెండు ఓటముల వల్ల మాహీని విమర్శించేవాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆయనొక మ్యాచ్ విన్నర్ అని..టీమ్ కోసం ఇప్పటి వరకు ఏం చేశాడో రికార్డ్స్ చెబుతాయంటున్నారు. మరి మహీలోని మ్యాచ్ విన్నర్ మళ్లీ నిద్రలేచే చాన్స్ ఉందా? ఏదైమేనా అభిమానులు మాత్రం..మళ్లీ గెలిపించు తలా అని కోరుకుంటున్నారు.
తలా ఓ మాట అంటున్నారు..

Related Post

మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?
ఈ సీజన్ ఐపీఎల్‌లో దాదాపు చాలా టీమ్స్‌కు వారి మాజీ ప్లేయర్స్ కొరకరాని కొయ్యలా తయారవుతున్నారు. ఇంకా చెప్పాలంటే మాజీ ప్లేయర్లే ఓటమిని శాసిస్తున్నారు. రివేంజ్ తీర్చుకుంటున్నారా? కసితో ఆడుతున్నారో తెలియదుగానీ, మాజీ టీమ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మొన్నటి వరకూ

బట్లర్.. వాహ్ చేజ్బట్లర్.. వాహ్ చేజ్
గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్..సెంచరీ మిస్ చేసుకున్నా సరే, తన టీమ్‌ను దగ్గరుండి మరీ గెలిపించాడు. అది కూడా 204 పరుగుల టార్గెట్..అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి

మళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచిందిమళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచింది
పంజాబ్ కింగ్స్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ లో స్కోరింగ్ ఎన్‌కౌంటర్‌ను చవిచూసింది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 111 రన్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 రన్స్‌ను కొంచెం కష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వధేరా (19 బాల్స్‌లో 33*,