రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవన్ చూడగానే టక్కున కనిపెట్టగలిగే లోపం ఒకటుంది. అదే మ్యాచ్ విన్నర్ లేకపోవడం. గత సీజన్ వరకు జాస్ బట్లర్ రాయల్స్ తరపున అదరగొట్టాడు. అంతకు ముందు సీజన్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ సీజన్‌కు ముందు బట్లర్ రిలీజ్ చేయడమే రాయల్స్ చేసిన అతిపెద్ద తపపు. పోనీ ఇప్పుడున్న టీమ్‌లో తోపులు లేరా అంటే లేరని కాదు, కానీ సరైన ఎగ్జిక్యూషన్ చూపించట్లే. యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు ఇరగదీసిందేమీ లేదు..ఇక సంజూ శాంసన్ తన మార్క్ చూపెట్టాల్సిందే. రియాన్ పరాగ్ కూడా త్వరగానే వికెట్ పారేసుకుంటున్నాడు. హెట్‌మెయిర్ క్లైమాక్స్‌లో పనికొస్తాడే తప్ప..కచ్చితంగా నిలబడి గెలిపించేంత క్యారెక్టర్ కాదు.. ఇప్పుడు వీళ్లు నమ్ముకోవాల్సింది సూపర్‌స్టార్ల నుంచి కన్సిస్టెన్సీ..ఏ ఇద్దరైనా సరిగా కుదురుకుంటేనే రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాటింగ్ పరమైన చిక్కులు తప్పుతాయి. లేదంటే ప్రతీ మ్యాచ్‌లో ఎవరి నుంచైనా అద్భుతం ఆశించాలి.
రాజస్థాన్ రాయల్స్ చేసిన తప్పు అదే..

Related Post

మాజీ ఛాంపియన్లకు కష్టమేనా?మాజీ ఛాంపియన్లకు కష్టమేనా?
ఐపీఎల్ సీజన్ 18లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్‌పై ఒక అంచనాకు రావడం సరైనది కాకపోయినప్పటికీ…ఆ టీమ్స్ ఆటతీరు గురించి చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్,

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కి
కర్ణ్‌శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అసలైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 పరుగుల టార్గెట్ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,

స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్‌తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్