గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్..ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది హార్దిక్ పాండ్య వర్సెస్ శుభ్‌మన్ గిల్..హార్దిక్ పాండ్య గుజరాత్‌కు చెందిన క్రికెటర్ అతడు గతంలో గుజరాత్ టైటన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం..ఏకంగా కెప్టెన్సీ అప్పగించడంతో ఇప్పుడు అతడు ఐపీఎల్‌లో ముంబైకర్ గా మారిపోయాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటన్స్‌కు కెప్టెన్..అతడికి అహ్మదాబాద్ గ్రౌండ్‌లో అనేక రికార్డులున్నాయి. గిల్ వర్సెస్ పాండ్య అంటే ఇద్దరు లోకల్స్ మధ్య ఫైట్‌లాగే ఉండబోతోంది. ప్రేక్షకులు సొంత జట్టుకు మద్దతు తెలిపినా..తమ క్రికెటర్‌కు కూడా సపోర్ట్ చేస్తారు. మరి పాండ్య ముంబైని తన సొంతగడ్డపై గెలిపిస్తాడా? శుభ్‌మన్ గిల్ గుజరాత్‌ని సొంత అభిమానుల ముందు గెలిపిస్తాడా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారనుంది.
చంటి లోకల్స్ ఫైట్

Categories:
Related Post

ఎవరి ఆశలు నిలబడతాయ్..?ఎవరి ఆశలు నిలబడతాయ్..?
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM
ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

ధోని..ద ఫినిషర్..అంతేధోని..ద ఫినిషర్..అంతే
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్‌ను మళ్లీ గుర్తు