గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ విరుచుకుపడటం గురించే అంతా మాట్లాడుకున్నారు. కానీ ఈ సీజన్‌లో లక్నో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. సన్‌రైజర్స్ విసిరిన 191 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించింది. సన్‌రైజర్స్ బౌలింగ్‌ను నికోలస్ పూరన్ ఊచకోత కోశాడు. ఇతనికి మిచెల్ మార్ష్ కూడా తోడయ్యాడు. ఇక చివర్లో అబ్దుల్ సమద్ కూడా సుడిగాలిలా రెచ్చిపోయాడు. ఈ ముగ్గురూ గతంలో సన్‌రైజర్స్‌కు ఆడినవారే. వీళ్ల విధ్వంసం ధాటికి సన్‌రైజర్స్ రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లింది. దీని నుంచి కోలుకోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద సమస్యేమీ కాదు, కానీ లక్నో మాత్రం పాత లెక్కసరిచేయడమే కాదు, రన్‌రేట్ కూడా బాగా పెంచుకుని పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున ప్రతీ టీమ్ రికవర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సన్‌రైజర్స్ కూడా ఈ సీజన్‌లోనే లక్నోకి మళ్లీ తిరిగి ఇచ్చే చాన్స్ కూడా ఉంది, మే 18న ఈ ఇరుజట్లు లక్నోలోని వాజ్‌పేయి స్టేడియంలో మరోసారి తలపడనున్నాయి. అది ఎస్ ఆర్ హెచ్ ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్ కూడా.
లక్నో రిటర్న్ గిఫ్ట్

Categories:
Related Post

విజిల్ మోగట్లే..విజిల్ మోగట్లే..
చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్..ఈ సీజన్‌లో నాసిరకం ఆటతీరు కనబరుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి

ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వదిలేశాడుఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వదిలేశాడు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వదిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుందనేది మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఆ విషయం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదార్‌కు బాగా అర్థమై, అనుభవమై ఉంటుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో

ముంబైకి మాంచి వికెట్ కీపర్?ముంబైకి మాంచి వికెట్ కీపర్?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మిగతా స్లాట్స్‌ను ఎలా భర్తీ చేసుకున్నా, ఎవరితో భర్తీ చేసుకున్నా సరే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం నిఖార్సైన బ్యాటర్ కమ్ కీపర్ కోసం చూస్తోంది. గతంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిషన్‌ను