టీమిండియా లెజెండ్స్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందా? అంటే కానే కాదు..ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్..జస్ట్ గేమ్‌ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్‌లో తప్ప ఇంకెక్కడా ఆడటం లేదు.. ఆల్రెడీ ఐపీఎల్‌లో 5 ట్రోఫీలు గెలిపించాడు. కుర్రాళ్లకు భరోసాగా ఉండేందుకు, అభిమానులను అలరించేందుకు ఆడుతున్నాడు. దీంతో అతడి ఆట, వికెట్ల వెనకాల అతడి వేట చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉంటారు. ఇక విరాట్ కోహ్లీ మాత్రం ఆర్సీబీని కచ్చితంగా గెలిపించేందుకు సాయశక్తులా పోరాడతాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీలో హంగర్ బాగా ఉందనే చెప్పాలి. ఇక చెపాక్‌లో ఆర్సీబీ రికార్డు చెత్తగా ఉంది. సీఎస్కేతో ఇక్కడ 8 మ్యాచ్‌లు ఆడితే ఒకే ఒక్కసారి గెలిచింది. అది కూడా 8 ఏళ్ల క్రితం. మరి ఇప్పుడా రికార్డును మెరుగుపరచుకోవాలనే తపనతో ఉంది.
యంగ్ కెప్టెన్ రజత్ పటిదార్, ఫారిన్ హిట్టర్స్ ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టన్, టిమ్ డేవిడ్ ను కట్టడి చేయడమే చెన్నై బౌలర్ల టార్గెట్. గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ వేసిన నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ మరోసారి విజృంభించే చాన్స్ఉంది. సీనియర్ బౌలర్లు అశ్విన్, జడేజా కూడా ఇరగదీసేందుకు రెడీ అయ్యారు. లిటరల్‌గా ఇది ధోని వర్సెస్ కోహ్లీ కానే కాదు..ఆర్సీబీ బ్యాటింగ్ వర్సెస్ సీఎస్కే బౌలింగ్..
ధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదు

Categories: