ఆక్షన్‌లో అన్‌సోల్డ్..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవకాశం అతణ్ని వదల్లేదు. గాయంతో టోర్నీకి దూరమైన మొహిషిన్ ఖాన్ ప్లేస్‌లో శార్దూల్‌ను తీసుకుంది లక్నో. అదే ఆ జట్టుకు ఇప్పుడు కలిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే లక్‌నవూకు దేవుడిలా మారడు. యాక్షన్‌లోకి దిగాడో లేదో పని మొదలెట్టాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు..ఇక గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 4 వికెట్లు..అది కూడా ఐపీఎల్ కెరీర్ బెస్ట్ నమోదు చేసుకున్నాడు.
అంతేకాదు బ్యాటింగ్‌కు స్వర్గంలా ఉండే పిచ్‌పై.. విధ్వంసానికి కేరాఫ్ అయిన సన్‌రైజర్స్ బ్యాటర్స్‌ను 200 మార్క్ చేరకుండా అడ్డుకున్నాడు. క్రెడిట్ అంతా శార్దూల్‌దే..ఇన్నింగ్స్ మొదట్లోనే అభిషేక్‌ను ఔట్ చేసి సన్‌రైజర్స్ పవర్‌ప్లే దూకుడుకు కళ్లెం వేశాడు. ఆ తర్వాత సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌ను తొలి బంతికే ఔట్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. మిగతా బౌలర్లూ సహకరించడంతో సన్‌రైజర్స్ 190 రన్స్‌కే పరిమితమైంది. ఇక లక్నో బ్యాటర్లు మాత్రం ఈ టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదేశారు. నికోలస్ పూరన్ పూనకం వచ్చినవాడిలా ఆడి 26 బంతుల్లోనే 70 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (52) కూడా ఇరగదీయడం..అబ్దుల్ సమద్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో లక్నో 191 రన్స్ టార్గెట్‌ను 16.1 ఓవర్లలోనే చేదించింది.
అబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడు

Categories: