Cricket Josh IPL ఇప్పుడు పీట‌ర్స‌న్‌..అస‌లు రీజ‌న్ ధావ‌న్‌

ఇప్పుడు పీట‌ర్స‌న్‌..అస‌లు రీజ‌న్ ధావ‌న్‌

ఇప్పుడు పీట‌ర్స‌న్‌..అస‌లు రీజ‌న్ ధావ‌న్‌ post thumbnail image

అశుతోష్ శ‌ర్మ..పంజాబ్ కింగ్స్‌ను గెలిపించిన హీరో. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై హీరోచిత ఇన్నింగ్స్ ఆడి 210 ప‌రుగుల టార్గెట్‌ను చేదించ‌డంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ యంగ్‌స్ట‌ర్. ఐతే మ్యాచ్ గెలిపించిన త‌ర్వాత అత‌డు స్విచ్ హిట్ కొట్టిన‌ట్టు సెల‌బ్రేట్ చేస్తూ..పంజాబ్ మెంటార్ కెవిన్ పీట‌ర్స‌న్‌కు థాంక్స్ చెప్పాడు. దీంతో అశుతోష్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన‌ క్రెడిట్ అంతా పీట‌ర్స‌న్‌దే అని చాలా మంది అనుకున్నారు. కానీ తెర‌వెన‌క ఉన్న‌ది టీమిండియా లెజెండ్ శిఖ‌ర్ ధావ‌న్. ఈ విష‌యాన్ని ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటున్న స‌మ‌యంలో అశుతోష్ స్వ‌యంగా చెప్పాడు. తన స‌క్సెస్ కు కార‌ణం శిఖ‌ర్ ధావ‌న్ అని, అత‌డి థాంక్స్ చెప్పాల‌నుకుంటున్న‌ట్టు తెలిపాడు. ఆ త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న అశుతోష్‌కు శిఖ‌ర్ ధావ‌న్ నుంచి వీడియో కాల్ వ‌చ్చింద‌ని..ధావ‌న్‌, అశుతోష్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశాడు. ఈ విష‌యాన్ని వెంట‌నే అశుతోష్ త‌న టీమ్‌మేట్స్‌కు చూపిస్తూ సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

నిజానికి 2024 ఐపీఎల్ (సీజ‌న్‌కు ముందే) ప్రీ సీజ‌న్ క్యాంప్‌లో ధావ‌న్‌ను అశుతోష్ క‌లిశాడు. అప్పుడే అశుతోష్ టాలెంట్‌పై ఒక అభిప్రాయానికొచ్చిన ధావ‌న్ అత‌డిని ఎంక‌రేజ్ చేశాడు. ఆట‌కు ముందే ఎలా ఆడాలో అనేది విజువ‌లైజ్ చేసుకోవాలంటూ స‌ల‌హాలూ ఇచ్చాడు. ధావ‌న్ త‌న బ్యాట్‌ను అశుతోష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బ్యాట్‌తోనే అశుతోష్ రంజీ అరంగేట్రంలో గుజ‌రాత్‌పై సెంచ‌రీ చేశాడు. అప్ప‌టి నుంచి ఈ యంగ్‌స్ట‌ర్ ధావ‌న్‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉంటూ స‌ల‌హాలు సూచ‌న‌లూ తీసుకుంటున్నాడు. అదీ మ్యాట‌రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

అయ్యో..ఫిలిప్స్అయ్యో..ఫిలిప్స్

గ్లెన్ ఫిలిప్స్‌..ధ‌నాధ‌నా సిక్స‌ర్లు కొట్ట‌మంటే, సిక్స‌ర్లు కొడ‌తాడు. స్పిన్‌ బౌలింగ్ వేసి వికెట్లు తీయ‌మంటే వికెట్లు తీస్తాడు, క‌నీసం బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డైనా చేస్తాడు..క్యాచ్‌లు ప‌ట్టుకోవాలంటే న‌మ్మశ‌క్యం కాని రీతిలో క్యాచ్‌లు ప‌ట్టుకుంటాడు. ఫిల్డింగ్ చేసి ర‌న్స్ ఆపాలంటే డైవ్ చేసి మ‌రి

వెళ్లిపోతున్న‌ ట్రావిస్ హెడ్ ?వెళ్లిపోతున్న‌ ట్రావిస్ హెడ్ ?

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ డ్యాషింగ్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ త‌న స్వ‌దేశం ఆస్ట్రేలియాకు వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల హెడ్ ఆసీస్‌కు ప‌య‌న‌మ‌య్యే చాన్స్ ఉంది. ఒక‌వేళ హెడ్ రాబోయే మ్యాచ్‌ల‌కు మిస్సైతే స‌న్‌రైజ‌ర్స్‌కు కోలుకోలేని దెబ్బ‌ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే ఆడిన మూడు

చెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చింది

చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య అంత‌కు ముందు చెన్నైలో మ్యాచ్ జ‌ర‌గ‌గా..సీఎస్కే ముంబైని ఓడించింది. మ‌రి ఇప్పుడు ముంబై ఇలాఖా