ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఏడెన్ మార్క్‌రమ్ కూడా ఉన్నాడు. తెలుగు అభిమానులు ముద్దుగా మార్క్‌రమ్ మామ అని పిలుచుకునే ఈ సౌతాఫ్రికా కెప్టెన్..బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టాడు. మంచి రికార్డ్ ఉన్న ఇతడిని సన్‌రైజర్స్ వదులుకుంది సరే, మళ్లీ ఆక్షన్‌లో దక్కించుకుంటుందా అంటే దాదాపుగా ఔననే చెప్పాలి. ఎందుకంటే, సౌతాఫ్రికాలో కూడా ఐపీఎల్ లాంటి లీగ్ జరుగుతోంది. అందులో కూడా సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ ఉంది. దానికి కెప్టెన్ ఏడెన్ మార్క్‌రమ్, ఇప్పటి రెండు సీజన్లు జరగగా, రెండు సార్లు సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. మరి ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న మార్క్‌రమ్‌ను మెగా ఆక్షన్‌లో ఎలాగైనా దక్కించుకుంటుదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
నిజానికి SRH బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లుగా అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్ ఉంటారు. మిడిల్ ఆర్డర్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ ఉండనే ఉన్నారు. ఐతే నెంబర్ 3లో ఆడేందుకు అనుభవజ్ఞుడైన, నిఖార్సైన ప్లేయర్ అవసరం. ఆ ప్లేస్ మార్క్‌రమ్‌కు సూట్ అవుతుంది. ఆల్రెడీ ఫారిన్ కోటాలో కెప్టెన్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఉన్నారు. మరో ఐదుగురు ఫారిన్ ప్లేయర్స్‌నూ తీసుకోవచ్చు. మరి ఆ జాబితాలో మార్క్‌రమ్ ఉంటే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే ఆర్టీఎమ్ ఉపయోగించి మార్క్‌రమ్‌ను తీసుకోవాలనే ఆలోచనలో సన్‌రైజర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
2022 నుంచి 2023 వరకు సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2024లో ప్యాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ అప్పగించి మార్క్‌రమ్‌ను ప్లేయర్‌గా కొనసాగించింది సన్‌రైజర్స్.. మిడిల్ ఆర్డర్‌లో చాలా కీలకమైన ప్లేయర్, ఎన్నో ఇన్నింగ్స్‌లు ఒంటరిపోరాటం చేశాడు. నిలకడగా ఆడగలడు, సిక్సర్లు బాదగలడు.. మరి ఈసారి ఆక్షన్‌లో సన్‌రైజర్స్ ఏం చేస్తుందో చూడాలి
మామను మిస్ చేసుకోవద్దు
Categories: