Cricket Josh Matches ‘ఆస్ట్రేలియా’లోనే గంభీర్ ప్యూచ‌ర్

‘ఆస్ట్రేలియా’లోనే గంభీర్ ప్యూచ‌ర్

‘ఆస్ట్రేలియా’లోనే గంభీర్ ప్యూచ‌ర్ post thumbnail image

టీమిండియా కోచ్ గౌత‌మ్ గంభీర్‌ను కొన‌సాగించాలా లేదా టెస్ట్ ఫార్మాట్ నుంచి త‌ప్పించి కేవ‌లం వ‌న్డే, టీ20ల‌కే కోచ్‌గా ఉంచాలా అనేది ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌బోయే బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో తేల‌నుంది. ఆసీస్ గ‌డ్డ‌పై న‌వంబ‌ర్ 22 నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య‌ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జ‌రుగుతుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఒక‌వేళ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తే క‌చ్చితంగా కోచ్ గంభీర్‌పైనే తొలి వేటు ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది.
రీసెంట్‌గా స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్‌కు గురై అప‌కీర్తి మూట‌గ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా బీసీసీఐ ఆరు గంట‌ల‌పాటు కోచ్ గంభీర్‌, కెప్టెన్ రోహిత్‌తో చ‌ర్చించింది. కివీస్‌తో జ‌రిగిన సిరీస్‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఆరాతీసింది. ఆఖ‌రి టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వ‌డంపైనా, గంభీర్ అప్రోచ్‌పైనా ప్ర‌శ్న‌లు అడిగింది. బీసీసీఐ గంభీర్ విష‌యంలో కాస్త విముఖంగా ఉన్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం టీమిండియా టీ20 జ‌ట్టుకు ఇంట‌ర్మ్ హెడ్ కోచ్‌గా ఉన్న వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌కు టెస్ట్ జ‌ట్టు బాధ్య‌త‌లూ అప్ప‌గించే ఆలోచ‌న ఉన్న‌ట్టు బీసీసీఐ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఒక‌వేళ అదే జ‌రిగితే గంభీర్‌కు వ‌న్డే, టీ20 బాధ్య‌త‌లు ఇస్తారు. దీనికి గంభీర్ అంగీక‌రించ‌క‌పోతే వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌నే మూడు ఫార్మాట్ల‌కూ కొన‌సాగించే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఏదైమైనా గంభీర్‌కు తాడో పేడోలా మ‌రింది బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

india lost test series at home after 12 years

12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్

2012 ముందు వ‌ర‌కు టీమిండియా స్వ‌దేశంలో టెస్ట్‌లు గెల‌వ‌డం, ఓడ‌టం…సిరీస్‌లు గెల‌వ‌టం, ఓడ‌టం అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతూ ఉండేది, కానీ విరాట్ శ‌కం మొద‌ల‌య్యాక సీన్ మారిపోయింది. ఓట‌మే లేదు. టెస్ట్ మ్యాచ్ ఓడినా, ఆ సిరీస్ మాత్రం గెలిచేవారు. 2022 నుంచి

అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?

టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్…స్పిన్న‌ర్ అంటే అభిమానులు ఊరుకునేలా లేరు. ఎందుకంటే అశ్విన్‌ను ఇప్పుడు ఆల్‌రౌండ‌ర్ అనాల్సిందే. అత‌ని గ‌ణాంకాలు చూస్తూ విశ్లేష‌కులు సైతం ఒప్పుకోవాల్సిందే. 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 500ల‌కు పైగా వికెట్లు తీసి..3422 ర‌న్స్ చేశాడు.

కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..

రోహిత్‌శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా..రిటైర్ అయితే మంచిద‌ని ఉచిత స‌లహాలిస్తున్నారు, ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన టీమిండియాకు ఎన్నో విజ‌యాలు అందించిన ఆట‌గాళ్ల‌ను ఇలా విమ‌ర్శించ‌డం క‌రెక్ట్ కాదు. నిజానికి మ‌నం