రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా..రిటైర్ అయితే మంచిదని ఉచిత సలహాలిస్తున్నారు, ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కానీ ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ఆటగాళ్లను ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు. నిజానికి మనం కోరినా, కోరకున్నా..వాళ్లంతా రిటైర్మెంట్ స్టేజ్ కు వచ్చారన్న సంగతి వాళ్లకి తెలుసు. కాకపోతే ఇంకొన్నాళ్లు ఆడిన తర్వాత స్వీట్‌నోట్‌తో వీడ్కోలు చెప్తే సరి. అంతేకానీ విజయవంతంగా సాగిన తమ కెరియర్‌లను ఇలా అర్ధంతరంగా ముగించొద్దు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత కూడా ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత డొమెస్టిక్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది ఇంగ్లండ్ సిరీస్ ఉంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కొత్త కుర్రాళ్లు జట్టులో సెట్ అయిపోయారు. ఇక వన్డేల్లోనూ అది తప్పదు. మిగిలింది టెస్ట్ క్రికెటే..ఐతే టెస్ట్ క్రికెట్ ఆడాలంటే దూకుడు ఒక్కటే సరిపోదు. స్కిల్స్, టెక్నిక్ ఉండాలి.
కుర్రాళ్లు కుదరుకునే వరకు సీనియర్ల సపోర్ట్ చాలా అవసరం. డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ, గ్రౌండ్‌లో గాని వారి సలహాలు భవిష్యత్ తరానికి మేలు చేస్తాయి. రిటైర్మెంట్ నిర్ణయం వాళ్లకే వదిలేయాలి, అంతేగాని ఒక సిరీస్ ఓడగానే విమర్శలు గుప్పించడం సరికాదు..కాస్త సంయమనం పాటిద్దాం..లెజెండ్స్ ఆటను ఇంకొన్నాళ్లు చూద్దాం.
కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..
Categories: