ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మిగతా స్లాట్స్‌ను ఎలా భర్తీ చేసుకున్నా, ఎవరితో భర్తీ చేసుకున్నా సరే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం నిఖార్సైన బ్యాటర్ కమ్ కీపర్ కోసం చూస్తోంది. గతంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిషన్‌ను రిలీజ్ చేయడంతో..ఆ స్లాట్ కోసం ఎవరిని తీసుకుంటుందా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకవేళ మళ్లీ ఇషాన్ కిషన్‌నే తీసుకుంటుంది అనే వాళ్లూ ఉన్నారు. ఐతే ఈ స్లాట్ కోసం ఎవరెవర్ని ముంబై పరిగణలోకి తీసుకుంటుందో చూద్దాం..
ఇండియన్ వికెట్ కీపర్ల విషయానికొస్తే…ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేశ్‌శర్మ పేర్లే ముందుగా వస్తాయి. వీళ్లలో రిషబ్ పంత్ కోసం వెళ్లే అవకాశాలున్నాయి. ఒకవేళ అతను దక్కకపోతే ఇషాన్‌ను ఆర్టీఎమ్ ద్వారా తీసుకోవచ్చు. ఇషాన్ వద్దనుకుంటే జితేశ్‌శర్మ వైపూ వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
ఫారిన్ వికెట్ కీపర్ల కోసం వెళితే…ముందుగా జాస్ బట్లర్‌పైనే కన్నేస్తుంది ముంబై ఇండియన్స్. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేయించొచ్చు. ఐతే బట్లర్ కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇంగ్లండ్‌కే చెందిన మరో ఇద్దరు వికెట్ కీపర్లు ఫిల్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో కూడా ముంబై టీమ్‌కు అతికినట్టు సరిపోతారు. ఈ ఇద్దరూ ఓపెనింగ్ చేయగలరు. వీళ్లలో ఒకర్ని తీసుకునే చాన్స్ ఉంది. ఒకవేళ లెప్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తే..డెవాన్ కాన్వే కూడా ఉన్నాడు. ఈ న్యూజిలాండ్ వికెట్ కీపర్ సీఎస్కే తరపున అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ముంబై రిటైన్ చేసుకున్న వాళ్లంతా ఇండియన్ ప్లేయర్స్ కావడంతో..ఆక్షన్‌లో ఫారిన్ ప్లేయర్స్ స్లాట్స్ ఖాళీగానే ఉన్నాయి. వికెట్ కీపర్ స్లాట్‌ను ఫారినర్‌తో భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ముంబైకి మాంచి వికెట్ కీపర్?
Categories: