చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్‌శర్మలాగా, రాజస్థాన్‌కు సంజూ శాంసన్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన, ఆడుతున్న సూపర్‌స్టార్ ప్లేయర్స్ ఎవరైనా ఒకరు సన్‌రైజర్స్‌కూ ఉంటే బాగుండని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ సన్‌రైజర్స్ ఎక్కువగా ఫారిన్ ప్లేయర్స్‌పైనే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈసారి మెగా ఆక్షన్‌లో సన్‌రైజర్స్ ఇండియా స్టార్స్‌ను తీసుకోవాలనుకుంటే ఏ ఆటగాళ్లను తీసుకోవచ్చు? అనే చర్చా జరుగుతోంది.
ప్రస్తుతం మెగా ఆక్షన్‌లో ఉన్న ఇండియన్ ప్లేయర్స్‌లో బ్యాటర్ల విషయానికొస్తే.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడే చాన్స్ ఉంది. మరి వీళ్లలో సన్‌రైజర్స్ ఎవరి కోసమైనా వెళ్తుందా అనేది చూడాలి.
ఇక గత సీజన్‌లో చూస్తే నిఖార్సైన స్పిన్నర్ కరువయ్యాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను మళ్లీ తీసుకునే చాన్స్ లేకపోలేదు. ఇక ఇండియా స్పిన్నర్లు అశ్విన్, యుజ్వేంద్ర చహాల్ ఉన్నారు. ఒకవేళ దేశీ స్పిన్నర్ల కోసం వెళితే సుయాస్ శర్మ, స్వప్నిల్ సింగ్ కూడా ఉన్నారు. పేస్ బౌలర్లలో రిలీజ్ చేసిన కె. నటరాజన్‌ను మళ్లీ తీసుకునే చాన్స్ ఉంది. ఇతనితో పాటు భువీ, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, దీపక్ చహార్, హర్షల్ పటేల్, ఆకాశ్‌దీప్ ఉన్నారు. మరి వీళ్లలో ఏ ఇండియన్ ప్లేయర్స్‌ని సన్‌రైజర్స్ తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.