సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో నలుగురు తప్ప మిగతా వాళ్లంతా ఏదో ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న వాళ్లే…ఐతే ఆ నలుగురు ఇప్పుడు సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో సత్తాచాటితే ఇటు ఇండియాకు మేలు, అటు వాళ్లకు ఆక్షన్‌లో మంచి ధర దక్కే చాన్స్ కూడా ఉంటుంది.
పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన అర్ష్‌దీప్‌సింగ్ ఇప్పుడు ఆక్షన్‌లో హాట్‌కేక్‌లా మారనున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో ఇతడే టీమిండియాకు ప్రంట్‌లైన్ బౌలర్. ఆక్షన్‌లో ఇతని కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. మిగతా ఫ్రాంచైజీలు పోటీపడి దక్కించుకున్నా సరే, ఒకవేళ పంజాబ్ కింగ్స్ తీసుకోవాలనుకుంటే ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి పొందొచ్చు.
ఇక రెండో ప్లేయర్ జితేశ్ శర్మ..ఇతడిని కూడా పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న జితేశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చాన్స్ వస్తే మరోసారి ప్రూవ్ చేసుకుందామని చూస్తున్నాడు. ఐతే వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఉండటంతో ఇతనికి ఎన్ని అవకాశాలు ఇస్తారనేది చూడాలి.
మూడో ప్లేయర్ వైశాక్ విజయ్‌కుమార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఈ యువ బౌలర్ వికెట్ల వేటలో ఆకట్టుకున్నాడు. ఐతే ఇప్పుడు సఫారీ గడ్డపై సత్తాచాటి ఆక్షన్‌లో మెరిసేందుకు రెడీ అయ్యాడు.
నాలుగో ప్లేయర్ అవేశ్‌ఖాన్, రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రిలీజ్ చేసింది. టీమిండియాలో ఇన్ అండ్ ఔట్ అవుతున్న ఈ పేసర్, సౌతాఫ్రికాపై టీ20ల్లో రెచ్చిపోతే ఐపీఎల్ ఆక్షన్‌లో మంచి ధర దక్కడం ఖాయం.