Cricket Josh IPL RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?

RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?

RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు? post thumbnail image

RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో కీ రోల్ ప్లే చేయ‌బోతున్నాయి. ఈ కార్డ్ గ‌తంలో కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈసారి నిబంధ‌న మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే త‌మ ఆట‌గాడిని ఆక్ష‌న్‌లో తిరిగి ద‌క్కించుకోవాల‌నుకుంటుందో..ఆ ఆట‌గాడిని వేరే ఫ్రాంచైజీ తీసుకుంటే..ఆర్టీఎమ్ ద్వారా ఆ ఆట‌గాడిని తిరిగి తాము ద‌క్కించుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రిలీజ్ చేసిన ఒక‌ ఆట‌గాడిని ఆక్ష‌న్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ రూ.4 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌నుకో… అంతే ధ‌ర చెల్లించి ఆ ఆట‌గాడిని తిరిగి పొందే హ‌క్కు స‌న్‌రైజ‌ర్స్ కు ఉంటుంది. ఐతే కొత్త రూల్ ప్ర‌కారం స‌న్‌రైజ‌ర్స్, సీఎస్కే మ‌ధ్య మ‌ళ్లీ బిడ్ పోరు జ‌రుగుతుంది. అంటే సీఎస్కే 4 కోట్ల‌కు మార్క్‌ర‌మ్‌ను ద‌క్కించుకున్న‌పుడు, స‌న్‌రైజ‌ర్స్ అంత‌కంటే ఎక్కువ బిడ్ చేయాలి..ఒక‌వేళ మ‌ళ్లీ సీఎస్కే ఎలాగైనా ఆ ఆట‌గాడిని ద‌క్కించుకోవాలంటే బిడ్‌ను పెంచుకుంటూ పోవ‌చ్చు,

స‌పోజ్ మార్క్‌ర‌మ్ ధ‌రను స‌న్‌రైజ‌ర్స్ 6 కోట్ల‌కు బిడ్ చేయ‌గా, సీఎస్కే 7 కోట్లు, మ‌ళ్లీ స‌న్‌రైజ‌ర్స్ 8 కోట్లు..ఇలా పెంచుకుంటూ పోవ‌చ్చు. ఏదో ఒక ధ‌ర వ‌ద్ద ఒక ఫ్రాంచైజీ ద‌క్కించుకునే చాన్స్ ఉంటుంది. ఇలా ఒక ఫ్రాంచైజీ ద‌గ్గ‌ర ఎన్ని ఆర్టీఎమ్ కార్డ్‌లు ఉంటే తాము రిలీజ్ చేసిన‌ అంత‌మంది ఆట‌గాళ్ల‌ను పైన చెప్పిన ప‌ద్ధ‌తి ద్వారా తిరిగి పొందొచ్చు. ఏ ఫ్రాంచైజీ ద‌గ్గ‌ర ఎన్నెన్ని ఆర్టీఎమ్ కార్డ్‌లు ఉన్నాయో చూద్దాం.

పంజాబ్ కింగ్స్‌- 4 RTM కార్డ్స్, ఆర్సీబీ- 3 RTM కార్డ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ – 2 RTM కార్డ్స్ ఉండ‌గా..ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, గుజ‌రాత్ టైట‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద‌గ్గ‌ర ఒక్కో RTM కార్డ్ ఉన్నాయి. ఇక కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ద‌గ్గ‌ర RTM కార్డ్స్ లేవు. ఆ టీమ్స్ 6 గురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఇద్ద‌రిలో ఎవ‌రు? న‌లుగురిలో ఎవ‌రు?ఇద్ద‌రిలో ఎవ‌రు? న‌లుగురిలో ఎవ‌రు?

మ‌రోకొన్ని గంట‌ల్లో ముంబై ఇండియ‌న్స్ ఎవ‌రెవ‌రిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్ప‌టికే మిగ‌తా జ‌ట్లు క‌నీసం ఒక‌రిద్ద‌రి విష‌యంలో క్లారిటీకి వ‌చ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వ‌డం లేదు. ముఖ్యంగా రోహిత్‌శ‌ర్మ ఆట‌గాడిగా కంటిన్యూ అవుతాడా

ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఐతే ఆక్ష‌న్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆట‌గాళ్ల‌లో ముఖ్యంగా చెప్పుకోవ‌ల్సింది కేఎస్ భ‌ర‌త్ గురించి. 2015లోనే

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..

న‌వంబ‌ర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ కోసం అంతా సిద్ధ‌మైంది. ఆట‌గాళ్లు కూడా త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆట‌గాళ్లు ఆక్ష‌న్ లిస్ట్‌లో త‌మ పేరును న‌మోదు చేసుకోగా, ఇందులో