Cricket Josh IPL ఇటలీ నుంచి తొలిసారిగా..

ఇటలీ నుంచి తొలిసారిగా..

ఇటలీ నుంచి తొలిసారిగా.. post thumbnail image

న‌వంబ‌ర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ కోసం అంతా సిద్ధ‌మైంది. ఆట‌గాళ్లు కూడా త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆట‌గాళ్లు ఆక్ష‌న్ లిస్ట్‌లో త‌మ పేరును న‌మోదు చేసుకోగా, ఇందులో ఇట‌లీకి చెందిన థామ‌స్ డ్రాకా కూడా ఉన్నాడు. ఇట‌లీ నుంచి ఒక ప్లేయ‌ర్ రిజిస్ట‌ర్ అవ‌డం ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇదే మొద‌టిసారి. 24 ఏళ్ల థామ‌స్ డ్రాకా ఈ ఏడాదే టీ20లో అరంగేట్రం చేశాడు. అది కూడా, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌బ్ రీజ‌న‌ల్ యూరోపియ‌న్‌ క్వాలిఫ‌య‌ర్స్ లో ల‌క్సెంబ‌ర్గ్‌పై ఆడాడు. ఇత‌ను రైట్ ఆర్మ్ మీడియం పేస‌ర్‌. మ‌రి థామ‌స్ తొలిసారి ఆక్ష‌న్‌లో ఏ ఫ్రాంచైజీనైనా ఆక‌ట్టుకుంటాడో చూడాలి.
మొత్తం 1574 మంది ప్లేయ‌ర్స్ రిజిస్ట‌ర్ చేసుకోగా, ఇందులో ఇండియా నుంచి 1165 మంది, 409 మంది ఫారిన్ దేశాల నుంచి ఉన్నారు. ఇండియా త‌ర్వాత ఎక్కువ మంది సౌతాఫ్రికా నుంచి 91 ఉండ‌గా, ఆస్ట్రేలియా – 76, ఇంగ్లండ్- 52, న్యూజిలాండ్ -39, వెస్టిండీస్-33, శ్రీలంక- 29, ఆఫ్గ‌నిస్తాన్ నుంచి 29 మంది త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్

బ్రిటీష్ సింగ‌ర్‌, టీవీ న‌టి జాస్మిన్ వాలియా ముంబై ఇండియ‌న్స్ టీమ్ బ‌స్సులో క‌నిపించ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య‌తో ఈ అమ్మ‌డు డేటింగ్‌లో ఉన్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికారు

మాజీ ఛాంపియ‌న్లకు క‌ష్ట‌మేనా?మాజీ ఛాంపియ‌న్లకు క‌ష్ట‌మేనా?

ఐపీఎల్ సీజ‌న్ 18లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్‌పై ఒక అంచ‌నాకు రావ‌డం స‌రైన‌ది కాక‌పోయినప్ప‌టికీ…ఆ టీమ్స్ ఆట‌తీరు గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ చాంపియ‌న్లు ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్,

ల‌క్నో రిట‌ర్న్ గిఫ్ట్ల‌క్నో రిట‌ర్న్ గిఫ్ట్

గ‌త సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్స్ విరుచుకుప‌డ‌టం గురించే అంతా మాట్లాడుకున్నారు. కానీ ఈ సీజ‌న్‌లో ల‌క్నో రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. స‌న్‌రైజ‌ర్స్ విసిరిన 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 16.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్‌ను