Cricket Josh IPL వేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలో

వేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలో

వేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలో post thumbnail image

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో నిర్వ‌హిస్తున్న‌ట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జ‌రుగుతుంద‌ని, వేదిక‌ను కూడా ఖ‌రారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేయ‌గా, ఇప్పుడు జెడ్డాకు మార్చారు. జెడ్డాలోని అబాది అల్ జొహ‌ర్ ఎరీనాలో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ జ‌రుగుతుంది.

ఇప్ప‌టికే ఆయా ఫ్రాంచైజీలు అక్టోబ‌ర్ 31న ఆట‌గాళ్ల రిటైన్ లిస్ట్‌ను బీసీసీఐకి పంపాయి. ఇక మిగిలింది త‌మ‌కు కావ‌ల్సిన ఆట‌గాళ్ల‌ను మెగా వేలంలో ద‌క్కించుకోవ‌డ‌మే. అత్య‌ధిక ప‌ర్స్ పంజాబ్ కింగ్స్ వ‌ద్ద రూ.110.5 కోట్లు ఉండ‌గా, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌ద్ద రూ. 83 కోట్లు ఉంది. అత్య‌ల్పంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ముంబై ఇండియ‌న్స్ వ‌ద్ద చెరో 45 కోట్ల రూపాయ‌లు ఉన్నాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ. 55 కోట్లు, కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ రూ. 51 కోట్ల‌తో ఆక్ష‌న్‌కు రెడీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు..ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ మొన‌గాళ్లు..

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజ‌న్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్ష‌ర్ ప‌టేల్ అద‌ర‌గొడుతున్నాడు. గ‌త

joss buttler willing to leave rajasthan royals says sources

బ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కేబ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కే

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెనింగ్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..ఆ ఫ్రాంచైజీని వ‌దిలి ఆక్ష‌న్‌లోకి రావాల‌నుకుంటున్నాడ‌ట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే ఈసారి జ‌ర‌గ‌బోయే మెగా ఆక్ష‌న్‌లో ఇత‌డికి జాక్‌పాట్ ద‌క్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్న‌ర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా

ఇదేంద‌య్యా ఇది..163 ఏంద‌య్యాఇదేంద‌య్యా ఇది..163 ఏంద‌య్యా

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా త‌క్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, ప‌వ‌ర్ ప్లేలో 64 ర‌న్స్