Cricket Josh IPL వేలంలో గాలం ఎవ‌రికి?

వేలంలో గాలం ఎవ‌రికి?

వేలంలో గాలం ఎవ‌రికి? post thumbnail image

ఐపీఎల్ మెగా వేలం న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజ‌ధాని రియాద్‌లో జ‌ర‌గ‌నున్న‌ద‌ని స‌మాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా న‌వంబ‌ర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడ‌నుంది. ఐతే ఆ స‌మ‌యంలోనే ఆక్ష‌న్ పెట్టాలా వ‌ద్దా అనేదానిపై చ‌ర్చ కూడా జ‌రిగింది. ఆస్ట్రేలియా టైమింగ్ ప్ర‌కారం మ్యాచ్ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ముగుస్తుంది. అంటే టెస్ట్ మ్యాచ్ మూడో రోజు న‌వంబ‌ర్ 24న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ముగుస్తుంది. ఒక‌వేళ టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ఫినిష్ అవుతుంది అనే న‌మ్మ‌కం బీసీసీఐకి ఉందా? లేదంటే ఇండియ‌న్ టైమింగ్స్ ప్ర‌కారం ఆక్ష‌న్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఆస్ట్రేలియాలో మూడో రోజు ఆట ముగుస్తుంది క‌నుక ఎటువంటి క్లాష్ ఉండ‌బోద‌ని భావిస్తోందా?
స‌రే, ఆక్ష‌న్ తేదీలు అటు ఇటు ఐనా…ఆట‌గాళ్లు ఎటువైపు , ఎవ‌రికి వెళ‌తార‌నేది అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇండియా సూప‌ర్ స్టార్స్ రిష‌బ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్, అర్ష్‌దీప్‌సింగ్ ను ఎవ‌రు ఎంత ధ‌ర‌కు ద‌క్కించుకుంటార‌నేది హాట్ టాపిక్ అయింది. ఇక ఫారిన్ స్టార్ల‌లో జాస్ బ‌ట్ల‌ర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్ల‌ర్, గ్లెన్ ఫిలిప్స్ పై ఏ ఫ్రాంచైజీలు ఫోక‌స్ చేశాయ‌నేది ఆస‌క్తిక‌ర విష‌య‌మే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో కొత్త కుర్రాళ్ల హ‌వా కొన‌సాగుతోంది. అరంగేట్రంలోనే అద‌ర‌గొడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. వీళ్ల‌లో ముఖ్యంగా దిగ్వేశ్ రాఠీ , విఘ్నేష్ పుతుర్‌, జీష‌న్ అన్సారి, అశ్వ‌నీ కుమార్ ఉన్నారు. దిగ్వేశ్ రాఠీ, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఢిల్లీ

బ‌ట్ల‌ర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బ‌ట్ల‌ర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్

వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో ప‌రాభ‌వం ఎదురైంది. గుజ‌రాత్ టైట‌న్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 169 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్లు

ముంబై సిక్స‌ర్‌ముంబై సిక్స‌ర్‌

మొద‌టి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవ‌లం ఒక‌టే గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. కొంద‌రు విశ్లేష‌కులైతే ఈ సీజ‌న్‌లో చాన్సే లేద‌న్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ఈ టీమ్‌కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్