సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ 38 బాల్స్‌లో 76 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఐతే థర్డ్ అంపైర్ ఇచ్చిన రనౌట్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔటైన అనంతరం డగౌట్‌కు వెళ్తూ అక్కడున్న ఫోర్త్ అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..జీషన్ అన్సారీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతిని జాస్ బట్లర్ ఫైన్ లెగ్ వైపు తరలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ క్రీజు చేరుకునే లోపే హర్షల్ పటేల్ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. ఐతే థర్డ్ అంపైర్ రీప్లేలో ఆ బంతి వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్‌ను తాకి వికెట్ల పక్కనుంచి వెళ్లినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో క్లాసెన్ గ్లౌవ్ వికెట్లను తాకింది. రెండు మూడు యాంగిల్స్‌లో చూసిన తర్వాత థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. గిల్ ఉద్దేశంలో వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్ మాత్రమే వికెట్లను తాకిందని, బాల్ తాకలేదని వివరిస్తున్నాడు. ఐతే విశ్లేషకులు మాత్రం బాల్ సీమ్ వైపు వికెట్లను తాకిందని, అదే టైమ్‌లో క్లాసెన్ గ్లౌవ్ కూడా వికెట్లను తాకినట్టు చెబుతున్నారు.
రనౌట్‌పై గిల్ అసంతృప్తి

Related Post

లక్నోకి బ్యాడ్ న్యూస్లక్నోకి బ్యాడ్ న్యూస్
గుజరాత్ టైటన్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్

వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?
సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్‌కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్‌లకు మిస్సైతే సన్‌రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు

14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల