మొదటి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవలం ఒకటే గెలిచిన ముంబై ఇండియన్స్‌ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరు విశ్లేషకులైతే ఈ సీజన్‌లో చాన్సే లేదన్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ టీమ్‌కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలో..అందుకే వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు దూసుకెళ్లింది. ముంబై విజయాల్లో హిట్‌మ్యాన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, బుమ్రా, బౌల్డ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఐదుగురు మంచి ఫామ్‌లో ఉండటం ముంబైకి కలిసొస్తోంది. వీరితో పాటు రికెల్టన్, కర్ణ్‌శర్మ, దీపక్ చాహర్ కూడా టచ్‌లోకి రావడంతో ఈ టీమ్‌కి ఎదురేలేకుండా పోయింది. ఇదే తీరు కొనసాగిస్తే..ట్రోఫీల విషయంలో కూడా ముంబై సిక్సర్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై సిక్సర్

Related Post

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయగల సమర్థుడు.

థలా..అన్‌క్యాప్డ్ ఐపోలా..థలా..అన్‌క్యాప్డ్ ఐపోలా..
చెన్నై సూపర్ కింగ్స్ ఊహించినట్టుగానే ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్కలుంటాయి అవి ఇప్పుడు

స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్‌తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్