హమ్మయ్య.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి సొంతగడ్డపై మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో 3 ఓడిపోగా..ఈసారి గెలుపుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌కు స్వస్తి పలికింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (70), దేవ్‌దత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ(20) దూకుడుగా ఆడి రెండొందలు దాటించారు. 206 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాయల్స్ ఆరంభం అదరగొట్టినా..మళ్లీ పాత కథే రిపీట్ చేసింది. 49 రన్స్‌తో జైస్వాల్ టాప్ స్కోరర్ గా ఉండగా, జురేల్ (47) ఊరించి ఉసూరుమనిపించాడు. ఆర్సీబీ బౌలర్ జాష్ హేజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్‌తో టీమ్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు.
ఇరగదీసి మరీ..ఇంట గెలిచింది

Related Post

పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు ఫిల్‌సాల్ట్, విరాట్ కోహ్లీ. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కు దిగాడు. ఐనప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. ముఖ్యంగా

రైజర్స్ ఫాలింగ్..రైజర్స్ ఫాలింగ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 5వ ఓటమి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసింది. పిచ్ స్లోగా ఉండటం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త కలిసొచ్చినప్పటికీ…సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ముంబై బౌలర్లు పక్కా ప్లానింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను

కింగ్స్ ఫైట్ పంజాబ్‌దేకింగ్స్ ఫైట్ పంజాబ్‌దే
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ సాయంతో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా