చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ గెలిచి..ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తుండగా..పదో స్థానంలో ఉన్న సీఎస్కే సొంతగడ్డపై సత్తాచాటి తమ ఆశలు నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. రెండు జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే వరుసగా 6 మ్యాచ్‌లు గెలవాలి..అది ఈ మ్యాచ్‌తోనే మొదలెట్టాలని చూస్తున్నాయి ఇరుజట్లు. సీఎస్కే కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్. హోమ్ గ్రౌండ్‌లో మంచి రికార్డు ఉన్న ధోని..తన మైల్ స్టోన్ మ్యాచ్‌ను గెలుపుతో సెలబ్రేట్ చేస్తాడా? ఇక సన్‌రైజర్స్ ఇప్పటి వరకు చెపాక్‌లో సీఎస్కేను ఓడించిందే లేదు. ఆ చెత్త రికార్డును చెరిపేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆరాటపడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌కు డెవాల్డ్ బ్రెవిస్‌ను ఆడించే చాన్స్ ఉంది. ఇక సన్‌రైజర్స్ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకునే ఆలోచనలో ఉంది.
ఎవరి ఆశలు నిలబడతాయ్..?

Categories:
Related Post

రాజస్థాన్ రాయల్స్ చేసిన తప్పు అదే..రాజస్థాన్ రాయల్స్ చేసిన తప్పు అదే..
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవన్ చూడగానే టక్కున కనిపెట్టగలిగే లోపం ఒకటుంది. అదే మ్యాచ్ విన్నర్ లేకపోవడం. గత సీజన్ వరకు జాస్ బట్లర్ రాయల్స్ తరపున అదరగొట్టాడు. అంతకు ముందు సీజన్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ

ఈ సీజన్‌లో హ్యాట్రిక్ మొనగాళ్లు..ఈ సీజన్‌లో హ్యాట్రిక్ మొనగాళ్లు..
ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన తొలి టీమ్‌గా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతూ వరుసగా విజయాలు సాధిస్తోంది. కెప్టెన్‌గా అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. గత

ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవర్‌లో తొలి సిక్స్ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవర్‌లో తొలి సిక్స్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఈ స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. దానికి కారణం స్లో పిచ్. పవర్ ప్లేలో