కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖండించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కోసం టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తమ టీమ్స్, యావత్ భారత్ మొత్తం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతోందని…వారి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా దీనిపై దేశమంతా రగిలిపోతోంది.ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి కోరుకోవాలని, మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్‌లు ధరించి వారి సానుభూతి ప్రకటించుకున్నారు. నిమిషం పాటు మౌనం పాటించారు.
ఉగ్రదాడిని ఖండించిన ముంబై, సన్‌రైజర్స్

Related Post

అబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడుఅబ్బా..ఈ లార్డ్ ఒకడు..భలే తగులుకున్నాడు
ఆక్షన్‌లో అన్‌సోల్డ్..అమ్ముడుపోలేదు కానీ టోర్నీకి కొన్ని రోజుల ముందు అవకాశం అతణ్ని వదల్లేదు. గాయంతో టోర్నీకి దూరమైన మొహిషిన్ ఖాన్ ప్లేస్‌లో శార్దూల్‌ను తీసుకుంది లక్నో. అదే ఆ జట్టుకు ఇప్పుడు కలిసొస్తోంది. లార్డ్ అని పిలుచుకునే శార్దూల్..నిజంగానే లక్‌నవూకు దేవుడిలా

అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్‌అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్
ఆక్షన్‌లో దక్కిన భారీ ధర..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడా? మెంటల్లీ, టెక్నికల్లీ అంత ఫిట్‌గా అనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్, రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ వశమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం

సన్‌రైజర్స్‌కి ఇక నో చాన్స్సన్‌రైజర్స్‌కి ఇక నో చాన్స్
వరుసగా 5 మ్యాచ్‌లు గెలిస్తేనే..ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశమున్న దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 224 రన్స్ చేయగా..భారీ లక్ష్య చేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. ఓపెనర్లు శుభారంభం