ఇషాన్ కిషన్ .అతి పెద్ద పొరపాటు చేసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అప్పటికే సన్‌రైజర్స్ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్పలు పడుతోంది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ చహార్ బౌలింగ్‌లో వైడ్‌ను ఎదుర్కొని, దాన్ని ఔట్‌గా భావించి డగౌట్ వైపు వెళ్లిపోయాడు. నిజానికి అంపైర్ వైడ్‌గా ఇద్దామనుకుంటున్న టైమ్‌లో ఇషాన్ కిషన్ వాక్ చేయడంతో అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించాల్సి వచ్చింది. ఐతే రీప్లే చూసిన తర్వాత ఆ బాల్ కిషన్ బ్యాట్‌కు తగలకుండా కీపర్ చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వైడ్ బాల్‌కు తనకు తాను ఔట్‌గా భావించి కిషన్ డగౌట్ వైపు వెళ్లాడు. . పొరపాటు పడ్డాడా..? అతిగా ఆలోచించాడా? ఏం అర్థం కాక అభిమానులు షాక్‌కు గురయ్యారు. కామెంటేటర్లు, విశ్లేషకులు కిషన్ చేసిన పనిని తెలివి తక్కువ పనిగా అభివర్ణిస్తున్నారు.
నువ్వేం చేశావో అర్థమవుతోందా..?

Related Post

టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్

చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా

చెపాక్‌లో విజిల్ మోతచెపాక్‌లో విజిల్ మోత
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగ్రౌండ్ చెపాక్‌లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్‌మ్యాన్ రోహిత్‌ను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. రోహిత్ డకౌట్ అయిన తర్వాత ముంబై బ్యాటర్లు వరుస విరామాల్లో