బీసీసీఐ ప్రతి ఏడాది ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు దక్కింది. ఇక గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టు దక్కని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఈసారి మళ్లీ చోటు దక్కడం విశేషం. టీ20ల నుంచి రిటైర్ అయిన రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాను ఏ+ కేటగిరీలో చేర్చడం కొసమెరుపు. ఎందుకంటే ఈ ముగ్గురూ టీ20లకు గుడ్ బై చెప్పడంతో ఈసారి ఏ కేటగిరీ ఇస్తారని వార్తలు ప్రచారమయ్యాయి. కానీ బీసీసీఐ వాటిని తోసిపుచ్చుతూ ఈ లెజండరీ ప్లేయర్స్ ను ఉన్నత కేటగిరీలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ సిరాజ్ (ఏ), తిలక్‌వర్మ(సి), నితీశ్‌కుమార్ రెడ్డి (సి) బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులో ఉన్నారు. ఇక గతేడాది గ్రేడ్ సీలో ఉన్న శార్దూల్ ఠాకూర్, ఆవేశ్‌ఖాన్‌కు ఈసారి చోటు దక్కలేదు.
నాలుగు కేటగిరీల్లో (ఏ+, ఏ, బీ, సీ) మొత్తం 34 మంది క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మూడు ఫార్మాట్లలో ఆడిన వారికి, ఈ ఏడాది మంచి ప్రదర్శన చేస్తున్న క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చి వారికి వేతనాలు చెల్లిస్తుంది బీసీసీఐ.
గ్రేడ్ ఏ+ ( ఏడాదికి రూ.7 కోట్లు)
రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా
గ్రేడ్ ఏ (ఏడాదికి రూ. 5 కోట్లు)
మహ్మద్ సిరాజ్, KL రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమీ, రిషబ్ పంత్
గ్రేడ్ బీ ( ఏడాదికి రూ. 3 కోట్లు)
సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్
గ్రేడ్ సీ (ఏడాదికి కోటి రూపాయలు)
రింకూ సింగ్, తిలక్‌వర్మ, రుత్‌రాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పటిదార్, ధృవ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్‌శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా