ఈ సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్దిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సుదర్శన్ 52 రన్స్ చేయగా, గిల్ 90 రన్స్ వద్ద ఔటై సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. బట్లర్ (41) కూడా విజృంభించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. 199 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో కేకేఆర్ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ (50) చేసినా, మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్‌ఖాన్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి.
GT..యూ బ్యూటీ

Related Post

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

అట్లుంటది “ఇంపాక్ట్”అట్లుంటది “ఇంపాక్ట్”
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎప్పుడూ స్పెషలే, డిబేటబులే..ఆ డిస్కషన్ గురించి కాదుగానీ, ఓ సరదా సన్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. లక్నో, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లక్నో ఛేజింగ్ చేస్తున్న సమయంలో..ఇన్నింగ్స్ 13వ ఓవర్

ముంబైకి మాంచి వికెట్ కీపర్?ముంబైకి మాంచి వికెట్ కీపర్?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మిగతా స్లాట్స్‌ను ఎలా భర్తీ చేసుకున్నా, ఎవరితో భర్తీ చేసుకున్నా సరే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం నిఖార్సైన బ్యాటర్ కమ్ కీపర్ కోసం చూస్తోంది. గతంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిషన్‌ను