సొంతగడ్డపై ఓడిపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ప్రత్యర్థి వేదికల్లో చెలరేగి ఆడుతోంది. తాజాగా ములన్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో చేజ్ చేసింది. కేవలం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (61) హాఫ్ సెంచరీ చేసి ఔటవగా..విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానానికి చేరుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది. ప్రభ్‌సిమ్రన్ 33 రన్స్ చేయగా..కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఇంగ్లిస్ 29 రన్స్ చేశాడు. 114 పరుగులకే 6 వికెట్లు కోల్సోయిన పంజాబ్‌ను శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యన్సెన్ (25 నాటౌట్) ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యకు చెరో 2 వికెట్లు దక్కాయి.