Cricket Josh IPL 14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం..

14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం..

14 ఏళ్లకే అరంగేట్ర వైభ‌వం.. post thumbnail image

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వ‌య‌సులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెట‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వ‌న్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వ‌య‌స్కుడిగా సూర్య‌వ‌న్షి ఉండ‌గా..అంత‌కు ముందు ప్ర‌యాస్ రే బ‌ర్మ‌న్ ఆర్సీబీ త‌ర‌పున 16 ఏళ్ల 157 రోజుల‌ప్పుడు అరంగేట్రం చేశాడు. బీహార్‌కు చెందిన వైభ‌వ్‌.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో తుది జ‌ట్టులో లేకున్నా.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి అరంగేట్రం చేశాడు. అంతేకాదు..ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స‌ర్ కొట్టి వావ్ అనిపించాడు. అదే ఊపు కొన‌సాగించి 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 34 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.
ఇక‌ అతి చిన్న వ‌య‌సులోనే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో కోటీశ్వ‌రుడైన రికార్డూ వైభ‌వ్ సూర్య‌వ‌న్షి పేరిటే ఉంది. మెగా ఆక్ష‌న్‌లో ఢిల్లీతో పోటీప‌డి మ‌రీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇత‌డిని రూ. 1.10 కోట్ల ధ‌ర‌కు ద‌క్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

SRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెల‌వాలిSRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెల‌వాలి

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస‌గా 3 మ్యాచ్‌లు ఓడిపోయి త‌మ ప్ర‌యాణాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్ల‌తో ఉంది. స‌న్‌రైజ‌ర్స్‌కు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక‌వేళ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే

బ‌ట్ల‌ర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బ‌ట్ల‌ర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్

వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో ప‌రాభ‌వం ఎదురైంది. గుజ‌రాత్ టైట‌న్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 169 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్లు

పే…..ద్ద ఓవ‌ర్పే…..ద్ద ఓవ‌ర్

శార్దూల్ ఠాకూల్…ఉర‌ఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 5 వైడ్‌లు వేశాడు. ఆ త‌ర్వాతే లీగల్‌గా ఓవ‌ర్ మొద‌లైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవ‌ర్ ముగించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇలా పే…ద్ద