గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్..సెంచరీ మిస్ చేసుకున్నా సరే, తన టీమ్‌ను దగ్గరుండి మరీ గెలిపించాడు. అది కూడా 204 పరుగుల టార్గెట్..అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో గుజరాత్ తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (7) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ఇక మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్ 36 రన్స్ చేసి ఔటయ్యాడు. 74 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను బట్లర్, రూథర్‌ఫోర్డ్ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 119 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశారు. రూథర్‌ఫోర్డ్ 34 బాల్స్‌లో 43 రన్స్ చేసి ఔటవగా..బట్లర్ 54 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. గుజరాత్ 18.5 ఓవర్లలో టార్గెట్ చేజ్ చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది.
ఢిల్లీ బ్యాటర్లు
ఇక ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయకపోయినా, టాపార్డర్‌లో ఐదుగురు బ్యాటర్లు తలా కొన్ని రన్స్ జత చేశారు. కరుణ్ 31, అక్షర్ 39, స్టబ్స్ 31, అశుతోష్ 37, కేఎల్ రాహుల్ 28 రన్స్ సాధించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్‌కు 4 వికెట్లు దక్కాయి.
బట్లర్.. వాహ్ చేజ్

Categories: