Cricket Josh IPL చెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చింది

చెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చింది

చెన్నై ప్లాన్ ప్ర‌కార‌మే అత‌డిని తెచ్చింది post thumbnail image

చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య అంత‌కు ముందు చెన్నైలో మ్యాచ్ జ‌ర‌గ‌గా..సీఎస్కే ముంబైని ఓడించింది. మ‌రి ఇప్పుడు ముంబై ఇలాఖా వాంఖ‌డేలో మ్యాచ్ జ‌రుగుతుంది. మ‌రి హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని చెన్నైకి ఇచ్చిప‌డేయాల‌ని ముంబై చూస్తోంది. ఐతే చెన్నై జ‌ట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చేరాడు. గాయంతో టోర్నీకి దూర‌మైన గుర్‌జ‌ప్నీత్ సింగ్ స్థానంలో ఇత‌డిని రూ. 2.2 కోట్ల‌కు తీసుకుంది. 2022, 2024 సీజ‌న్ల‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఆడిన బ్రెవిస్..వాంఖ‌డేలో ఈసారి ఎల్లో డ్రెస్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సీజ‌న్‌లో త‌మ‌ మాజీ ప్లేయ‌ర్సే ఆయా టీమ్‌ల‌ ఓట‌మికి కార‌ణ‌మ‌వుతున్నారు. మ‌రి అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వాల‌ని బ్రెవిస్ వాంఖ‌డేలో అద‌ర‌గొట్టాల‌ని సీఎస్కే ఆశ‌ప‌డుతోంది. మ‌రి బ్రెవిస్‌ను ఆడిస్తారా..? బ్రెవిస్ ముంబై పాలిట విల‌న్‌లా మార‌తాడా…అనేది ఆస‌క్తిరేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఇది కూడా పాయే..ఇది కూడా పాయే..

పిచ్ మారింది..ఫ‌లితం మార‌లేదు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో మ‌రో ఓట‌మి..మ‌నోళ్లు బ్యాటింగ్ చేస్తున్న‌పుడు స్లో వికెట్ క‌దా..150 ప్ల‌స్ స్కోర్ స‌రిపోవ‌చ్చులే అనుకున్నారు. ప‌వ‌ర్ ప్లేలో 4 ఓవ‌ర్ల‌కు 16 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన‌పుడు..ఇక మ్యాచ్ మ‌న‌దే అనుకున్నాం..కానీ

త‌లా ఓ మాట అంటున్నారు..త‌లా ఓ మాట అంటున్నారు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓట‌ములు..ఆ టీమ్ సీనియ‌ర్ ప్లేయ‌ర్‌ మ‌హేంద్ర‌సింగ్ ధోనిపై విమ‌ర్శ‌లు గుప్పించేలా చేస్తున్నాయి. సీఎస్కే అభిమానులే త‌లాను విమ‌ర్శిస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇంకెంత‌కాలం త‌లా త‌లా అంటూ ఆరాధిస్తారు, ఎంత ఆరాధించినా ఆయ‌న బ్యాటింగ్

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించిన‌ట్టుగానే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్క‌లుంటాయి అవి ఇప్పుడు