రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే గెలుస్తుందనుకున్నారంతా..కానీ జైస్వాల్, పరాగ్ ఒకే ఓవర్‌లో ఔటవడంతో రాయల్స్‌కు గట్టిదెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లో రాయల్స్ గెలుపునకు 6 బాల్స్‌లో 9 రన్స్ అవసరం. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో.. స్ట్రైక్‌లో ఉన్న జురేల్ సింగిల్ తీసి హెట్‌మెయిర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఐతే హెట్‌మెయిర్ రెండు రన్స్ తీయగా..ఈక్వేషన్ 4 బాల్స్‌లో 6 రన్స్‌కు మారింది. ఈ టైమ్‌లో హెట్‌మెయిర్ ఔటయ్యాడు. ఈక్వేషన్ 3 బాల్స్‌లో 6 రన్స్‌గా మారింది. క్రీజులోకొచ్చిన శుభమ్‌కి యార్కర్‌తో స్వాగతం పలికి డాట్ బాల్ వేశాడు ఆవేశ్ ఖాన్. తర్వాత బాల్‌కు శుభమ్ ఇచ్చిన క్యాచ్‌ను మార్క్‌రమ్ డ్రాప్ చేయడంతో రెండు రన్స్ వచ్చాయి. ఇక చివరి బాల్‌కు 4 రన్స్ అవసరమవగా..కేవలం ఒకే రన్ రావడంతో లక్నో గెలుపు సంబరాల్లో తేలింది.
రాయల్స్‌కు మంచి ఆరంభం
14 ఏళ్ల వయసుకే అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవన్షితో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్..రాయల్స్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. మరో ఎండ్‌లో జైస్వాల్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సూర్యవన్షి , నితీశ్ రాణా వెంటవెంటనే ఔటైనప్పటికీ…జైస్వాల్, కెప్టెన్ పరాగ్ 62 పరుగులు జోడించారు. విజయానికి 25 రన్స్ దూరంలో ఉన్నపుడు జైస్వాల్, పరాగ్‌ను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి రాయల్స్‌ను దెబ్బతీశాడు ఆవేశ్ ఖాన్.
లక్నో పర్‌ఫెక్ట్ ఫినిష్
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో మొదట్లోనే వికెట్లు మార్ష్, పూరన్, పంత్ వికెట్లను కోల్పోయింది. ఐతే ఏడెన్ మార్క్‌రమ్ (66), ఆయుశ్ బడోని (50) హాఫ్ సెంచరీలు చేసి స్కోరు నిలబెట్టారు. ఇక చివర్లో అబ్దుల్ సమద్ (10 బాల్స్‌లో 30) విరుచుకుపడటంతో లక్నో స్కోర్ 20 ఓవర్లలో 180కి చేరింది