సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 5వ ఓటమి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసింది. పిచ్ స్లోగా ఉండటం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త కలిసొచ్చినప్పటికీ…సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ముంబై బౌలర్లు పక్కా ప్లానింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. అభిషేక్ 40, క్లాసెన్ 37, హెడ్ 28 రన్స్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 పరుగుల టార్గెట్‌ను ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రోహిత్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ.. 26 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ కుదురుకున్నారు. ఈ ఇద్దరూ రన్‌రేట్ పెరగకుండా చూశారు. రికెల్టన్ 36, జాక్స్ 31 రన్స్ చేయడంతో ముంబై టార్గెట్ దిశగా పయనించింది. ఆ తర్వాత సూర్య 26 కాసేపు అలరించగా..తిలక్‌వర్మతో కలిసి కెప్టెన్ హార్దిక్ ముంబైకి విజయతీరాలకు చేర్చాడు. స్కోర్లు సమమైన తర్వాత ముంబై వికెట్ కోల్పోవడంతో గెలుపు కాస్త ఆలస్యమైందని చెప్పొచ్చు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 31 రన్స్ చేసిన విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
రైజర్స్ ఫాలింగ్..

Categories:
Related Post

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..
చెన్నై సూపర్ కింగ్స్, దాదాపుగా తమ ప్లేయింగ్ లెవన్‌ను మార్చదు. టీమ్ నిండా సీనియర్ ప్లేయర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజన్‌లో మిగతా ఫ్రాంచైజీలు కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్, విఘ్నేశ్,

ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫారిన్ ప్లేయర్స్ జాక్‌పాట్ కొట్టడం చాలా సార్లు చూశాం. మరి ఈసారి మెగా ఆక్షన్‌లో ఎవరు ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌గా రికార్డు సృష్టిస్తారో ఒక అంచనా వేద్దాం. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే