రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సొంతగడ్డపై మూడో మ్యాచ్‌లో తలపడబోతోంది. ఇప్పటికే హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడిన ఆర్సీబీ ఈసారి ఆ ట్రెండ్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. మరోవైపు పంజాబ్ 111 రన్స్‌ను కూడా డిఫెండ్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసి వస్తోంది. రెండు టీమ్‌లు సూపర్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం..
ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడింది
ఆడిన 2 మ్యాచుల్లోనూ మొదట బ్యాటింగ్ చేసి 170 లోపు స్కోర్ చేసింది
ఈ 2 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి 17.5 ఓవర్లలోనే చేజ్ చేసి గెలిచింది.
విన్ మంత్ర
ఒకవేళ ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసినా..200 మార్క్ దాటాలి
కీ ప్లేయర్స్
(విరాట్, పతిదార్, మ్యాక్స్‌వెల్, శ్రేయస్, చహాల్, భువి)
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐతే చిన్నస్వామి స్టేడియంలో అతడికి బిగ్ ఇన్నింగ్స్ బాకీ ఉందనే చెప్పాలి. కింగ్ ఈ మ్యాచ్‌లో విజృంభించే చాన్స్ ఉంది.
రజత్ పతిదార్, ఆర్సీబీ కెప్టెన్ కూడా కోహ్లీ లాగే బెంగళూరులో ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పటి వరకు రెండు హాఫ్ సెంచరీలు ప్రత్యర్థి గ్రౌండ్‌లో (51 చెన్నైలో, 64 వాంఖడేలో) చేసినవే. ఇక హోమ్ ఫేట్‌ను తిరగరాసి..సొంత అభిమానుల ముందు గెలుపు బాట పట్టేందుకు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపేందుకు రెడీ అయ్యాడు రజత్.
పంజాబ్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు మరో అవకాశం ఇస్తే గనుక..అతడు చెలరేగి ఆడటం గ్యారెంటీ..ఆర్సీబీది ఫస్ట్ బ్యాటింగ్ ఐనా, సెకండ్ బ్యాటింగ్ ఐనా..ఇవాళ మ్యాక్స్‌వెల్ టీమ్‌లో ఉంటే క్లిక్ అవడం ఖాయమే అనిపిస్తోంది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సొంతగడ్డపై కంటే ప్రత్యర్థి గ్రౌండ్‌లోనే అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ములన్‌పూర్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. అదే బయట ఆడిన మూడు మ్యాచుల్లో (97* అహ్మదాబాద్, 52* లక్నో, 82 హైదరాబాద్ ) హాఫ్ సెంచరీలు చేశాడు. 200+ స్ట్రైక్‌రేట్
తో అదరగొడుతున్నాడు. మరి చిన్నస్వామిలోనూ రెచ్చిపోవడం ఖాయం
యుజ్వేంద్ర చహాల్, ఆర్సీబీకి 8 సీజన్లు ఆడిన మాజీ ప్రియుడు. ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ మాత్రమే కాదు, చిన్నస్వామి స్టేడియంలోనూ హైయెస్ట్ వికెట్ టేకర్. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 4 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు తనకు కలిసొచ్చిన చిన్నస్వామిలో ఏం చేస్తాడో తెలుసుగా..
భువనేశ్వర్‌కుమార్, చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ (2 26, 1 23 అదరగొట్టాడు. బంతికి సలైవా( లాలాజలం) వాడే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తాను వాడలేదని..ఈ మ్యాచ్ నుంచే మొదలుపెడతానని భువీ చెప్పాడు. మరింకేంటి ఈ మ్యాచ్‌లో స్వింగ్‌తో పంజాబ్ కింగ్స్‌ను కట్టడి చేస్తాడేమో.