హోమ్ గ్రౌండ్.. ఫస్ట్ బ్యాటింగ్..ఇదేదో కలిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వర్షం కారణంగా కుదించిన 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దేవుడిలా కాపాడాడు ఆర్సీబీని. మరీ దారుణంగా ఆలౌట్ కాకుండా అడ్డుకుని..పోరాడగలిగే స్కోర్‌ను సాధించి పెట్టాడు. కెప్టెన్ రజత్ పటిదార్ (23) తప్ప మిగతా బ్యాటర్స్ సింగిల్ డిజిట్స్‌కే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఐతే ఆఖరి ఓవర్‌లోనే అసలైన మజా వచ్చింది. 14వ ఓవర్‌లో చివరి మూడు బాల్స్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి..ఆ తర్వాత నో బాల్‌కు 2 రన్స్ తీసి టిమ్ డేవిడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, యన్‌సెన్, చహాల్, బ్రార్ తలా 2 వికెట్లు తీశారు.
దేవుడ్‌లా ఆదుకున్నాడు..

Related Post

ఎవరీ హిమ్మత్ సింగ్..?ఎవరీ హిమ్మత్ సింగ్..?
గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్‌ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ

ఇరగదీసి మరీ..ఇంట గెలిచిందిఇరగదీసి మరీ..ఇంట గెలిచింది
హమ్మయ్య.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి సొంతగడ్డపై మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో 3 ఓడిపోగా..ఈసారి గెలుపుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌కు

ఎక్కువ మాట్లాడితే అంతే..ఎక్కువ మాట్లాడితే అంతే..
కామెంటేటర్లు సైమన్ డూల్, హర్షా భోగ్లేను ఈడెన్‌గార్డెన్స్‌లో అడుగుపెట్టనివ్వొద్దంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)..బీసీసీఐకి లేఖ రాసింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ ఇద్దరూ చేసిన కామెంట్సే ఇందుకు కారణం. కేకేఆర్‌కు హోమ్ పిచ్ కలిసి రావట్లేదని..వాళ్లు వేరే గ్రౌండ్