పంజాబ్ కింగ్స్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ లో స్కోరింగ్ ఎన్‌కౌంటర్‌ను చవిచూసింది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 111 రన్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 రన్స్‌ను కొంచెం కష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వధేరా (19 బాల్స్‌లో 33*, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా ఆడటంతో పంజాబ్ గెలుపు సునాయసమైంది. ఓపెనర్లు ప్రియాన్ష్ (16), ప్రభ్‌సిమ్రన్ (13) దూకుడుగా మొదలెట్టినప్పటికీ ఇద్దరూ పవర్ ప్లే లోనే ఔటయ్యారు. పంజాబ్ పవర్ ప్లేలో 34 రన్స్‌కి 2 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7), జాస్ ఇంగ్లిస్ (14) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐతే జాస్ హేజిల్‌వుడ్ ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరినీ ఔట్ చేసి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ మరో వికెట్ పడకుండా చేజింగ్ దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో సుయాశ్ శర్మ బౌలింగ్‌పై కౌంటర్ ఎటాక్ చేశాడు నేహాల్ వధేరా..ఆ ఓవర్‌లో 15 రన్స్ వచ్చాయి. దాంతో ఈక్వేషన్ 18 బాల్స్‌లో 16 రన్స్‌కు మారింది. ఈ దశలో భువీ..శశాంక్ సింగ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వధేరా ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టడంతో ..ఈక్వేషన్ 12 బాల్స్‌లో 4 రన్స్‌కు చేరింది. మార్కస్ స్టొయినిస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కి 3 వికెట్లు దక్కాయి.
మళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచింది

Categories:
Related Post

ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్…రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్‌లో కీలక స్పిన్నర్. ఐతే ఇతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుజరాత్ మూడు మ్యాచులు ఆడగా..రషీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది

ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే
ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఐతే ఆక్షన్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది కేఎస్ భరత్ గురించి. 2015లోనే

ముంబైకి మాంచి వికెట్ కీపర్?ముంబైకి మాంచి వికెట్ కీపర్?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మిగతా స్లాట్స్‌ను ఎలా భర్తీ చేసుకున్నా, ఎవరితో భర్తీ చేసుకున్నా సరే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం నిఖార్సైన బ్యాటర్ కమ్ కీపర్ కోసం చూస్తోంది. గతంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిషన్‌ను