మాజీ ప్రియుడే హతమార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ తరచుగా క్రైమ్ వార్తల్లో చూస్తాం. ఇక్కడ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆర్సీబీ విషయంలో గుజరాత్‌కు ఆడిన సిరాజ్, ఢిల్లీకి ఆడిన కేఎల్ రాహుల్..గతంలో ఆర్సీబీ ప్లేయర్సే..వాళ్లు ఈ సీజన్‌లో ఆర్సీబీపై సత్తా చాటి వారి ఓటమికి కారణమయ్యారు. ఇక తాజాగా యుజ్వేంద్ర చహాల్ కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఆర్సీబీ పాలిట విలన్‌గా మారాడు. 8 సీజన్లు ఆర్సీబీ తరపున ఆడిన చహాల్.. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఆడుతున్నాడు. ఆల్రెడి అంతకు ముందు కేకేఆర్‌పై ములన్‌పూర్‌లో 4 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్న చహాల్‌కు..తన పాత గ్రౌండ్‌లో అడుగుపెట్టగానే మరింత జోష్ వచ్చింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. అప్పటికే 26 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్సీబీని చహాల్ కోలుకోలేని దెబ్బతీశాడు. ముందుగా జితేశ్‌ను ఔట్ చేసి..ఆ తర్వాత సెట్ అయిన బ్యాటర్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్‌ను ఔట్ చేసి తన మాజీ టీమ్‌ను నట్టేన ముంచాడు. 3 ఓవర్లు వేసి కేవలం 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
మాజీ ప్రియుడి ట్రెండ్

Related Post

భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిసింది.పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ (81) తో దుమ్మురేపగా, విధ్వంస ప్రేమికుడు నికోలస్ పూరన్ కేకేఆర్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు.

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ
ఈ సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్

బట్లర్.. వాహ్ చేజ్బట్లర్.. వాహ్ చేజ్
గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్..సెంచరీ మిస్ చేసుకున్నా సరే, తన టీమ్‌ను దగ్గరుండి మరీ గెలిపించాడు. అది కూడా 204 పరుగుల టార్గెట్..అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి