టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌పై వేటు వేసింది బీసీసీఐ. గత ఏడాది జులైలో నియామకం జరిగినప్పటికీ..టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌పై ఘోర వైఫల్యం, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ పరాభవం పాలైంది. ఈ రెండు టెస్టు సిరీసుల్లో స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ విఫలమైనా కోచింగ్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ..గతంలోనే బీసీసీఐ మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కోచింగ్ స్టాఫ్‌ను కుదించే పనిలో పడింది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ను కొనసాగించడం కూడా కష్టమే అనిపిస్తోంది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డొస్కటేకు ఈ బాధ్యతలు అప్పగించే ప్లాన్‌లో ఉంది బీసీసీఐ. ఇక స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ను కూడా కొనసాగించకూడదనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.
అభిషేక్ నాయర్‌పై వేటు..దిలీప్ కూడా?

Categories: